అమృత బిందువులు - 22 జీవన తత్వం - 3

P Madhav Kumar


*జీవన తత్వం - 3*

నీరు ఎలా మొక్కలను పెంచగలదో అలాగే ఆదరాభిమానాలు మనిషి ఆశయాలను పెంచగలవు.


వాగును దాటాలంటే వారధి నీ బరువు మోయాలి. జీవి గమనాన్ని చేరుకోవాలంటే వారధి లాగా నీ తల్లీ , దండ్రీ నీ బరువు మోయాలి.


పిల్లలు లేని గృహం వృక్షాలు లేని వనం లాంటిది.


కృషి సాగించితేనే అవకాశాలు లభించగలవు. సక్రమ మార్గంలో సరియైన అవకాశాన్ని ఎంచుకొని , కృషితో దాన్ని అభివృద్ధి పరచుకో గలిగితేనే అందులోని సుఖాన్ని పొందగలవు.


ఆత్మీయ మల్లె మొగ్గలాంటిది. మల్లె మొగ్గ పుష్పంలా వికసించి సువాసనలు వెదజల్లినట్లు ఆత్మీయత ఎక్కువైతే మల్లె పుష్పంలా సువాసనలు వెదజల్ల గలదు. 


అసంతృప్తిని ఆదిలోనే త్రుంచివేయండి. అది ఎక్కువ అయ్యేకొలది మనిషిని క్షీణింపచేయడమే కాకుండా పతనం కూడా చేయగలదు.


కాచిన చెట్టుకురాళ్ళదెబ్బలు తప్పదన్నట్లు కీర్తివంతులకు ఆపద , అవహేళనలు వెన్నంటే వుంటాయి. సమయ స్ఫూర్తితో వాటిని అధిగమించే వారే నిజమైన కీర్తివంతులు కాగలరు.


దైవ చింతన పెరిగే కొలది కోరికలు తరిగి , నిరాశలు తొలగి , ఆత్మలో అద్భుతమైన పరమానందం పొందగలరు.


కష్టాలలో గల మానవులకు అమృతం లాంటి మాటలు ఆనందం కురిపించి , ఆత్మను మురిపించగలవు. 


మానవులు స్వశక్తికి తోడు ఇతరుల సహాయ సహకారాలు లభించినప్పుడే విజయాన్ని పొందగలరు.


మంచి వారి స్నేహము మరిచిపోలేని మాధుర్యము లాంటిది.


ప్రోత్సాహము లేని జీవితము ఎదగని మొక్క లాంటిది.


అనురాగం అమృతం లాంటిది. అనురాగం కరువైతే జీవితం బరువవుతుంది. అనురాగామృతము పెరిగే కొలది జీవితము ఆనందమయము కాగలదు. 


పెను తుఫానుల దాటికి కొన్నివృక్షాలు ఎలా ఎదురొడ్డి నిలుస్తాయో అదే విధంగా కొందరు మానవులు జీవిత విషవలయాలకు ఎదురొడ్డి నిలువ గలరు.


ప్రయత్నము చేయని మానవుడు పగిలిన పెంకులాంటి వాడు


అసంతృప్తిని తొలగించుకో. సంతృప్తితో ఆత్మను మురిపించుకో.


నిజమైన ఆత్మీయుల అనురాగానికి అనంతమే సాటిరాదు.


ఉన్నవారే గొప్పవారు అనుకోకూడదు. ఉన్నంతలో మంచిగా జీవించే వారు కూడా గొప్పవారు కాగలరు.


నిందించడంలో గొప్పతనమేమియు కానరాదు , మన్నించడంలోనే సాటిలేని గొప్ప తనము అగుపించును.


ఆలోచనలేని జీవితము చీకటి నిండిన బాట లాంటిది.


దుష్టబుద్ధులకు దూరపు ఆలోచన వుండదు. మంచికి అర్థము అసలే తెలియదు. దురాలోచనే వుంటుంది.


సుఖమని పరుగులు తీయకండి. కష్టమని వెనుకడుగులు వేయకండి.

రెండింటిని సమతూకము గావించుకొని సంతోషాన్ని పొందండి.


పాపభీతి లేని జీవితము పాషాణం వంటిది.


వృక్షానికి తీగ అంటే ఎంతో మమకారం. అదే విధంగా తల్లిదండ్రులకు బిడ్డలంటే ఎంతో మమకారం.


మానవ జీవితాలు సుడిగుండాల వంటివి. కొందరు సుడిగుండాలలో పడి మరణిస్తారు. మరికొందరు సుడి గుండాల నుండి బయటపడి జీవిస్తారు. 


గింజకు కాయలో ఉన్నంత వరకు రక్షణ లభించినట్లు , భర్త ఉన్నంత వరకు స్త్రీకి రక్షణ లభించును.


అనుకున్నది సాధించాలంటే అణకవతో వుండాలి.


విపత్తును భయపడక ధైర్యముగా ఎదుర్కొనాలి. 


విజయమునకు కీలకము పట్టుదల.


అపజయాన్ని గూర్చిన భయమును జయించుటయే నిజమైన విజయము. 


తన్నుతాను మెచ్చుకొనుట తనకే అపకారమును చేసుకొనునట్లే కాగలదు. 


ఇతరుల ఉన్నతికి పాటుపడితే అంత గొప్పవాళ్ళగుదురు. 


చేసిన వాగ్దానాన్ని మరవడం కన్నా మరణించడమే మేలు.


సత్యాన్ని ప్రేమించేవాడే , అసత్యాన్ని ఖండించగలడు.


మనిషి చేతులు అతని జీవితమునకు ఇండెక్సు లాంటిది.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat