⚜️ పందళ రాజ దర్శనము ⚜️
పంబనుండి సన్నిధానమునకు పయణమయ్యే భక్తాదులు పంబాగణపతి , పార్వతి , హనుమంతుడు , శ్రీ రాముడు మున్నగు దేవతలను దర్శిస్తూ నడిచే మార్గాన రంగురంగుల గొడుగులతో అలంకరించబడిన యొక చిన్న పర్ణశాలను కానవచ్చును.ఇచ్చట సాక్షాత్ తారక ప్రభువైన ధర్మశాస్తావారిని పంబానదీతీరాన పసిబాలునిగా దొరికిన దేవకుమారుడని తెలియకనే కొనిపోయి అయ్యప్పగా , మణికంఠుడిగా , అల్లారుముద్దుగా పన్నెండేండ్లు పెంచి పెద్ద జేసి , పిదప ఆ తనయుని సాహస చర్యలద్వారా దైవమై దర్శించి భూతనాథ గీతా శ్రవణముచే జ్ఞానము సాయుజ్యము
పొందిన అలనాటి పందళరాజు రాజశేఖర పాండ్యుని వంశీయులు అమరి తమ కుల దైవాన్ని దర్శించుటకు తరలి వస్తున్న భక్తులకు విబూది ప్రసాదములు యొసంగి అందరిని ఆశీర్వదించుచున్నారు. రాజ్యాలు పోయినా , పరివారము , సైన్యము అన్నియు పోయినా చిరునవ్వును మాత్రము పోనివ్వక అలుపుసొలుపు లేక మందహాస వదనముతో శుభాశీస్సులను భక్తులకు అందించుటకై అమరియుండు అయ్యప్ప స్వామి వంశీయుడైన రాజుగారి సమూహమునకు వెడలి నమస్కరించి , శక్తి కొలది దక్షిణ యొసంగి వారి హస్తముతో విబూది ప్రసాదము పుచ్చుకొని యాత్రను కొనసాగింతురు.
🙏🌻ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప💐🙏...