త్రివిధ త్యాగాల - త్రివిధ మైత్రి...! గురించి తెలుసుకుందాం.

P Madhav Kumar


ఏదో ఒక కర్మ చెయ్యకుండా ఏ ప్రాణీ ఉండలేదు. మంచి పనులు చేస్తే కీర్తి ప్రతిష్టలు, స్వర్గసుఖాలు, పుణ్యఫలాలు వస్తాయి. చెడ్డపనులు చేస్తే సంఘంలో చెడ్డపేరు, నరకయాతనలు, పాపఫలాలు వస్తాయి. ఇలా పాపపుణ్యాలు చేస్తూ, స్వర్గనరకాలనుభవిస్తూ, మరల మరల జన్మలెత్తుతూ ఈ జన్మ మరణ సంసారచక్రంలో ఉండిపోవలసిందేనా? లేక మోక్షం పొందడం ఉందా? అని మనం విచారించడం సహజం. మనలోని ఈ విచారాన్ని దూరం చేయడానికే గీతలో శ్రీకృష్ణ భగవానుడు చక్కని మార్గం చూపాడు.

*యత్కరోషి, యదశ్నాసి, యజ్జుహోషి దదాసియత్*

*యత్తపస్యసి, కౌంతేయ! తత్కురుష్వమదర్పణమ్*

తా" అర్జునా! నువ్వేపని చేసినా, ఏమి తిన్నా, ఏ హోమం చేసినా, అదంతా నాకు సమర్పించు.

అయితే ఈ సలహా పాటిస్తే మనకు వచ్చే లాభం ఏమిటి? ఇలా చేస్తే, మనం మూడు త్యాగాలు చేసినట్లవుతుంది.

*మొదటిది కర్తృత్వ త్యాగం.

* ఈ పని నేనే చేస్తున్నాను లేదా చేయిస్తున్నాననే అహంకారం వదలాలి. ఏ కర్మయినా ఆ భగవంతుడే చేయిస్తున్నాడని భావించాలి. ఏం చేసినా భగవత్పరంగా చెయ్యాలి. ఇలా చేస్తే, మనం పాపపు పనులు చేయడానికి జంకుతాము. కర్మసాక్షి అయిన భగవానుణ్ణి తలుచుకుంటూ సదా సత్కర్యాలకు పూనుకుంటాము.

*రెండవది ఫలత్యాగం.

* ఏం చేసినా ఇది నా కర్తవ్యం అని చెయ్యాలి. అంతేగాని ఇద్ చేస్తే నాకీ ఫలం వస్తుంది అని కోరికతో చెయ్యవద్దు. నేనేం చేసినా దాని ఫలం భగవానుడిదే అన్నీ భగవత్ కైంకర్య రూపాలే అని నమ్మాలి.

*మూడోది సంగత్యాగం.

* ఇది నాది, ఇది నేనే చెయ్యాలి. అంతా నా ఇష్టప్రకారం జరగాలి. ఇది నా ఆనందం కోసం అని బంధం పెంచుకోవద్దు. అంతా భగవన్ముఖ వికాసం కోసం, ఆయన ఆనందమే నా ఆనందం అని మనస్పూర్తిగా అనుకోవాలి.

సరే! ఈ త్రివిధ త్యాగాలు ఎలా చేయాలి? ఏ పనిచేసినా, ఒక్క నమస్కారం పెట్టి, ఒక్క మాట చెపితే చాలు. ఏమిటండీ ఆ బంగారాల మాట? అదే *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

పై త్రివిధ త్యాగలను త్రికరణ శుద్ధిగా అవలంబిస్తూ, ఇంకొక్క మాటను కూడా జోడించాలి. అదే సర్వేజనా సుఖినోభవంతు.

సేకరణ  రామిరెడ్డి మానస సరోవరం👏


త్రివిధ  మైత్రి...!

```మన జీవితాలలో మనకు లభించే మిత్రులను గురించి మూడు వృక్షాలతో పోల్చి  చెప్తూవుంటారు. అవి... తాటిచెట్టు, కొబ్బరి చెట్టు మరియు పోకచెట్టు.```


తాటిచెట్టు:

```తన ఎదుగుదలకు కావలసిన నీటిని తానే స్వయంగా సేకరించుకొని పెరిగి పెద్దదై  మనకి పలురకాలుగా ఉపయోగపడుతుంది. మన స్నేహితులలో కొంతమంది యిలాటివారు వుంటారు. వారు తమకు తాముగానే ముందుకు వచ్చి అవసర సమయాలలో సహాయ పడతారు.```


కొబ్బరి చెట్టు:

```ఎప్పుడైనా నీరు పోస్తే చాలు. అది పెరిగి మనకి అధిక ఫలాలని యిస్తుంది. ఆవిధంగానే కొందరు మిత్రులు ఎప్పుడో మనం చేసిన ఉపకారాన్ని మనసులో పెట్టుకుని మనకి అవసరమైన సమయాలలో సహాయపడతారు.```


పోకచెట్టు:

```పోకచెట్టుకి నిత్యం నీరుపోస్తూ పోషిస్తూ వుంటేనే అది పచ్చగా పెరుగుతుంది. కొంతమంది మిత్రులు మనం తరచు సహాయం చేస్తూ వుంటేనే మనలని జ్ఞాపకం పెట్టుకుంటారు.✍️```

          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat