ప్రాచీన భారతంలో - మజ్జిగ వాడకం

P Madhav Kumar

 

ప్రాచీన భారతంలో - మజ్జిగ వాడకం

ఒకనాడు మన తెలుగు నాట ప్రతి ఊరిలో ప్రతి ఇంటిలో లెక్కకు మించి ఆవులు , గేదెలు .పాలిచ్చే పశువులు ఎన్ని ఉన్న ఇంటి నిండా ,కుండల నిండా ఎంత పెరుగు ఉన్న ఆనాటి కుటుంబ సభ్యులు ఎవరూ ఆ పెరుగు వాడేవారు కాదు . ప్రతి రోజూ ఉదయాన్నే ఆ పెరుగు ను చిలికీ పూర్తిగా వెన్న తీసి తగినన్ని మంచి నీరు కలిపి పలుచని తీయని మజ్జిగ తయారు చేసుకొని ఆహరంలో ఉపయోగించేవారు. ఇది మన అందరికీ తెలిసిన విషయమే . కాని కమ్మని గడ్డ పెరుగు ను వదిలి పెట్టి పలుచని నీరు వంటి మజ్జిగ ను తాగడం లో ఉన్న ఆంతర్యము ఏమిటో మనకు తెలియదు . ఈనాడు ఆ ఆంతర్యం గురించి తెలుసుకుందాం .

ఆధునిక భారతం లో - పెరుగు వాడకం

ఈనాడు దాదాపు నూటికి 90% మంది ప్రజలు తమ ఆహారం లో మజ్జిగ ను పూర్తిగా మానేశారు. రోజూ రెండు పూటలా పెరుగు ను మాత్రమే వాడుతున్నారు. పెరుగు ను చిలికి వెన్న తీసి మజ్జిగ ను తయారు చేయడానికి కొంత సమయం వెచ్చించాలి . కాబట్టి ఆ విధంగా సమయం వృధా చేయకుండా అన్నము లో పెరుగు ను కలుపుకొని తినడమే గొప్ప నాగరికత అని ఈనాడు అంతా మురిసి పోతున్నారు. అయితే పెరుగు ఆయుక్షిణం. ముఖ్యంగా రాత్రి సమయంలో అసలు వాడకూడదు. అలా వాడితే ఉదరంలో వాయువు ఎక్కువ అయ్యి అనేక వాత రోగాలు వస్తాయని ఆయుర్వేద మహర్షులు మనకు నిక్కచ్చిగా తేల్చి ఏనాడో చెప్పారు. అయినా రోజూ రోజుకు కష్టపడి పని చేసే స్వభావం కోల్పోతు బద్ధకస్తులుగా మారుతున్న నేటి గృహిణులు మజ్జిగ ను తయారు చేసి వాడడం కన్నా పెరుగు ను వాడటానికే ప్రాధాన్యత ఇస్తున్నారు.

మజ్జిగ లో 5 రకాలు

1 మధితము అనే మజ్జిగ: పేరుకొన్న పాలల్లో నీరు కలపకుండా చిలికి తయారు చేసిన మజ్జిగ ను మధిత మజ్జిగ అంటారు . ఇది చిక్కగా జిడ్డు గా ఉంటుంది ఈ మజ్జిగ ను ఆహారం లో వాడుతూ ఉంటే నీరసం , ఉదర రోగాలు పైత్యము వల్ల కలిగిన వాతము నాలుక కు రుచి తెలియక పోవడం , మూత్రము ఆగిపోవడం , నీళ్ళ విరోచనాలు మొదలైనవి హరించి పోయి శరీరానికి మంచి బలం కలుగుతుంది . ఈ రకమైన మజ్జిగ ను మన రెండు రాష్ట్రాల ప్రజలు గ్రిష్మ, శరత్, హేమంత, శిశిర బుుతువులలో సేవించి ఆరోగ్యం పొందవచ్చు.

2 మిళితమను మజ్జిగ : పెరుగు ఒక వంతు నీళ్లు మూడు వంతులు పోసి చిలికి తయారు చేసిన మజ్జిగ మిళిత మజ్జిగ అనబడుతుంది. ఇది శరీరం లో పైత్యాన్ని అరుచిని అతిసార విరోచనాన్ని రక్తం లో చేరిన వాతాన్ని ఇంకా అనేక రోగాలను పోగొడుతుంది. ఈ మజ్జిగ అన్ని కాలాలలో తీసుకోవచ్చు శ్రేష్ఠమైనది.

3 గోళము అను మజ్జిగ : ఒక వంతు పెరుగు ఒకటిన్నర వంతు నీళ్లు కలిపి తయారు చేసినది. ఈ విధమైన మజ్జిగ వాడుతుంటే వీర్య వృద్ధి కలిగి శరీరానికి మంచి కాంతి వస్తుంది . కంటికి మంచి మేలు చేస్తుంది . ఉదరము లో మందాగ్ని విష దోషాలు మేహము ప్రమేహము కఫ రోగము ఆమ రోగము పోగొడుతుంది . ఈ రకమైన మజ్జిగ గ్రీష్మ, వర్షం బుుతువులయందు తీసుకోవాలి .

4 షాడభము అను మజ్జిగ : ఒకవంతు పెరుగు అయిదు వంతుల నీళ్ళు కలిపి తయారు చేసింది . ఇది శ్లేష్మ రోగాలను , గుల్మ రోగాలను , రక్త మూల వ్యాధి ని పోగొడుతుంది. తేలికగా ఉండి ఉదరములో జఠరాగ్నిని పెంచి శరీరానికి కాంతి ఇస్తుంది.

5 కాలశేయము అను మజ్జిగ : ఒక వంతు పెరుగు రెండు వంతుల నీళ్ళు కలిపి తయారు చేసింది . ఈ మజ్జిగ బంకా విరోచనాలు , విషములను, ఉబ్బులను, మంటను, వాతమును, మూల వ్యాధిని పోగొట్టి శరీరం త్వరగా ముడతలు పడకుండా కాపాడుతుంది. ఇప్పటికే పడిన ముడతలను కూడా తీసి వేస్తుంది .


రచయత: సేకరణ : జంపని శ్రీనివాస మూర్తి గారు

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat