*పవిత్ర కార్తీకమాసం-దీపారాధన*

P Madhav Kumar

*కార్తీకంలో దీపారాధనలకి ఈక్రింది రకాల వత్తులనుఉపయోగించుట  ద్వారా ఉత్తమమైన ఫలితాలను పొందవచ్చును*

*ఆదివారం* - పారాణి లో తడిపి ఆరబెట్టిన వత్తులు
*సోమవారం* - అరటి దూట తో నేసిన వత్తులు (నూనెలో బాగా నానపెడితే చక్కగా వెలుగుతాయి)
*మంగళవారం* - కుంకుమ నీళ్ళ లో తడిపి ఆరబెట్టిన వత్తులు.
*బుధవారం* - పసుపు, గంధం, పన్నీరు కలిపిన నీళ్ళ లో తడిపి      ఆరబెట్టిన వత్తులు.
*గురువారం* - కొబ్బరి నీళ్ళ లో తడిపి ఆరబెట్టిన వత్తులు.
*శుక్రవారం* - పసుపు నీళ్ళ లో తడిపి ఆరబెట్టిన వత్తులు.
*శనివారం* - తామర తూడు తో నేసిన వత్తులు (నూనెలో బాగా నానపెడితే చక్కగా వెలుగుతాయి)
అవకాశం ఉన్నవారు పై విధంగా దీపారాధన ప్రక్రియను ప్రయత్నించ గలరు.
కార్తీకమాసంలోచేయకూడని పనులు
ఇంగువ,వుల్లిపాయ,వెల్లుల్లి,ముల్లంగిదుంప,గుమ్మడికాయ,శనగపప్పు,పెసరపప్పు,నువ్వులు కార్తీకమాసంలో తినటం నిషేధం.
కంచుపాత్ర్తలో భోజన౦, ఆదివారం  కొబ్బరికాయ,ఉసిరికాయ తినరా దు.భోజన సమయంలో మౌనంగా వుండాలి .మాసపురాణ౦ వినాలి. 
*కార్తీక స్నాన మంత్రము*
కార్తీకేహం కరిష్యామి ప్రాతః స్నానం జనార్దన!
ప్రీత్యర్ధం తన దేవేశ దామోదర మయా సహ!
*కార్తీకమాసం*
కార్తీకముతో సమానమైన మాసము లేదు. విష్ణు దేవునితో సమానమయి న దేవుడు లేడు. గంగతో సమాన మగు తీర్థము లేదు అని చెప్పబడినది.
 తెల్లవారుజామునే నిద్రలేవడం, ప్రవహిస్తూ ఉన్నటువంటి నీళ్లలో స్నానం చేయడం, బోళాశంకరునికి నిత్యమూ రుద్రాభిషేకం చేయడం, నుదుట విభూతిని మెడలో రుద్రాక్షల్నీ- లేదా- తులసి పూసల్ని ధరించండం రోజుకి ఒక పూట మాత్రమే భుజించడం, ఉసిరిక చెట్టు నీడలో వనభోజనాలు చేయడం, ఒకటేమిటి? ఇలాఎన్నెన్నో సంప్రదాయాలని మూటగట్టుకుని తెచ్చింది పవిత్రమైన కార్తీకమాసం.
 ఈ కార్తీక మాసంలో చేసే వ్రతములలో ముఖ్యమైనవి. కార్తీకస్నానం,ఉపవాసము, కార్తీకదీపము.
*కార్తీకస్నానం*
కార్తీక మాసమంతా తెల్లవారుజామున లేచి కృత్తికా నక్షత్రం అస్తమించేలోగానే నదులలో గాని తటాకాలలో గాని అలాంటివి అందుబాటులేనప్పుడు ఇంట్లోని స్నానాల గదిలో అయినాసరే, తలస్నానం చేయాలి. అప్పుడే అది కార్తీక స్నానం అవుతుంది.
ఈ విధంగా నియమంతో స్నానం చేసి శివుడినిగాని, విష్ణవునుగాని, లేదా మరే దైవాన్నైనా సరే ధ్యానించడం వలన, అర్ఘ్యాదులు ఇవ్వడం వలన కురుక్షేత్రం, గంగానది, పుష్కర తీర్థాలలో స్నానం చేసిన ఫలితం లభిస్తుంది. సర్వపాపాలు నశించి పుణ్యఫలితాలు అందుతాయి.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat