తమిళనాడులోని తిరుచ్చిలోనిరాక్‌ఫోర్ట్‌ (తిరుచ్చి)కొండపై పై స్వయంభు గా వెలిసిన వినాయకుడు.

P Madhav Kumar


🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿


🌸వినాయకస్వామి దీనదయాళుడు. భక్తులు నిండుమనస్సుతో పూజిస్తే అనుగ్రహిస్తాడు. తమిళనాడులోని తిరుచ్చిలోనిరాక్‌ఫోర్ట్‌పైస్వయంభువుగా వెల‌సిన‌స్వామిభక్తులకుఆశీస్సులనుప్రసాదిస్తుంటాడు. సాధారణంగా స్వామివారి ఆలయాలు భూమిపై ఉంటే ఇక్కడ కొండపై ఉండటం విశేషం. 


🌷స్థలపురాణం 

🌿సీతను బందీగా ఉంచడాన్ని రావణుని సోదరుడు విభీషణుడు తీవ్రంగా వ్యతిరేకించాడు. వెంటనే రాముని వద్దకు వెళ్లి ఆశ్రయం పొందుతాడు. యుద్ధంలో రావణుడిని శ్రీరాముడు సంహరిస్తాడు. 


🌸విభీషణుడు తనకు చేసిన సాయానికి గుర్తుగా రంగనాథుని విగ్రహాన్ని రాముడు ప్రదానం చేస్తాడు. అయితే విభీషణుడు అసురుడు. దీంతో దేవతలు రంగనాథ విగ్ర‌హం శ్రీలంకకు చేరుకోకుండా అడ్డుకోవాలని నిర్ణయిస్తారు. 


🌿ఇందు కోసం గణపతిని ప్రార్థిస్తారు. స్వామి ప్రత్యక్షమై వారి కోరికను తీరుస్తానని మాట ఇస్తారు. విభీషణుడు తిరుచ్చి సమీపంలో విగ్రహాన్ని తీసుకువెళుతుండగా కావేరి నది కనిపించడంతో పుణ్యస్నానం చేయాలని భావిస్తాడు. 


🌸అయితే విగ్రహాన్ని నేల మీద పెడితే శాశ్వతంగా అక్కడే ఉండిపోతుంది. దీంతో అక్కడే పశువుల కాపరియైన బాలుడిని సాయం కోరుతాడు. కొద్ది సమయం మాత్రమే తాను విగ్రహాన్ని పట్టుకుంటానని సమయం ముగిసిన తరువాత భూమిపైన పెట్టివేస్తానని బాలుడు చెప్పడంతో అందుకు అంగీకరించిన విభీషణుడు విగ్రహాన్ని అతనికి అందజేస్తాడు. 


🌿బాలుని రూపంలో ఉన్నది సాక్షాత్తు వినాయకుడు కావడం విశేషం. కొద్ది సేపటికే గణపతి శ్రీరంగనాథ‌ స్వామి విగ్రహాన్ని భూమిపైన పెట్టడంతో నదిలో ఉన్న విభీషణుడు ఆగ్రహించి పరుగున ఒడ్డుకు వచ్చాడు. అయితే స్వామి విగ్రహాన్ని అక్కడ నుంచి తీయడం సాధ్యం కాలేదు. 


🌸దీంతో ఆగ్రహంతో బాలుడిని పట్టుకోవాలని చూస్తాడు. దీంతో బాలుడు వెంటనే పారిపోతాడు. అతన్ని పట్టుకోవాలనిపరుగెత్తడంప్రారంభించాడు. చాలాదూరం పరుగెత్తిన వినాయకుడు ఒక కొండపైకి వెళ‌తాడు. 


🌿చివరకు అతన్ని పట్టుకున్న విభీషణుడు నుదుటిపై గట్టిగా కొట్టడంతో స్వామి నవ్వుతూ అసలు రూపంతో దర్శనమిస్తాడు. 


🌸విభీషణుడు వెంటనే క్షమాపణలు కోరుకోవడంతో గణపతి అతనిని ప్రసాదించి శ్రీరంగనాథ‌స్వామి కావేరి తీరంలోనే ఉంటారని వెల్లడిస్తాడు. అనంతరం వినాయకుడు అక్కడే స్వయంభువుగా వెలసినట్టు తెలుస్తోంది. 


🌷ఎలా చేరుకోవాలి... 


🌸 తమిళనాడులోని తిరుచ్చికి దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి రోడ్డు సౌకర్యముంది. తిరుచ్చి రైల్వేస్టేషన్‌లో దిగి ఇక్కడకు చేరుకోవచ్చు. తిరుచ్చి విమానాశ్రయంలో దిగి వాహనాల ద్వారా ఆలయానికి చేరుకోవచ్చు. 


🌿ఆదివారంకు అధిపతి సూర్యుడు, రవిఎవరి జాతకం లో అయినా రవి దోషం లో ఉంటే ఈ క్రింది శ్లోకం 6,000 సార్లు మంచీ తిథి ఉన్న ఆదివారం కనుక పటిస్తే ఆ గ్రహ దోషం నివారణ అయ్యి ఆయురారోగ్యాలను, సుఖ సందలను, శత్రు విజయాన్ని పొందవచ్చు.


🌸జపాకుసుమ సంకాశమ్ | కాశ్యపేయం మహాద్యుతిం

తమో రిం సర్వపాపఘ్నమ్ | ప్రణతోస్మి దివాకరం..స్వస్తీ..


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat