అగ్ని పర్వత విస్ఫోటనం జరగకుండా రక్షిస్తున్న ఇండోనేషియా లోని తూర్పు జావా ప్రాంతం లోని " గణపతి దేవాలయం "

P Madhav Kumar

 🌿🌼🙏ఒక్కసారి ఈ చిత్రాన్ని గమనించండి🙏🌼🌿ఇక్కడ మనకు దర్శనమిచ్చే గణపతి వెనుక ఉన్నది బ్రోమో అనే అగ్ని పర్వతం🙏🌼🌿పూర్తిగా చదవండి.

🌿🌼🙏ఇండోనేషియా లోని తూర్పు జావా ప్రాంతం లోని " గణపతి దేవాలయం " ఇది 131 అగ్ని పర్వతాల సమూహమే ఈ బ్రోమో  పర్వతశ్రేణులు,

(బ్రోమో అంటే బ్రహ్మ అని అర్థం) 2329 అడుగుల ఎత్తులో ఈ పర్వతాల పై అగ్ని పర్వతం నుండీ వెలువడే అత్యంత వేడి పదార్థమైన లావా తో చేసిన గణపతి ప్రతిమ ఇది🙏🌼🌿


🌿🌼🙏సుమారు 700 సంవత్సరాల పూర్వం ప్రతిష్టించిన విగ్రహం ఇది. కాగా ఇక్కడ 48 గ్రామాల్లో 3లక్షల మంది హిందువులు వున్నారు,వీరు Tangeres అనే స్థానిక భాష మాట్లాడుతారు🙏🌼🌿


🌿🌼🙏ఈ దేవాలయం ఉన్న గ్రామాన్ని "చమోరో లావాంగ్" అని పిలుస్తారు. ఈ దేవాలయంలో ప్రతి సంవత్సరం జులై లో వచ్చే పౌర్ణమి నుండి 15 రోజులు పాటు "యదనాయ కసడ" పేరిట పెద్ద ఉత్సవాలు చేస్తారు. ఈ ఉత్సవాలు 500 సంవత్సరాల నుండి జరుగుతున్నట్టు సమాచారం🙏🌼🌿


🌿🌼🙏ఈ గణపతి విగ్రహాన్ని ప్రతిష్టించిన తరువాత అగ్ని పర్వత విస్ఫోటనం జరగకుండా రక్షిస్తున్నాడని వారి ప్రగాఢ విశ్వాసం🙏🌼🌿


🌿🌼🙏ఎంతటి కష్టాలైనా తొలగించే మహామహిమాన్వితమైన సంకట నాశన గణేశ స్తోత్రం ప్రతిరోజూ కనీసం 4 సార్లు అయినా, 6 నెలలు పాటు భక్తి శ్రద్ధ, విశ్వాసాలతో పఠిస్తే గణేశుని విశేష అనుగ్రహం కలుగుతుంది🙏🌼🌿


🌿🌼🙏మనం ఏ కార్యం తలపెట్టినా, అది ఎటువంటి అవరోధాలు కలుగకుండా, విజయవంతంగా కొనసాగాలని ప్రప్రథమంగా శ్రీ విఘ్నేశ్వరుని ప్రార్ధిస్తాము. సకల సంకటాలనూ తొలగించే గణపతి అనుగ్రహం కోసం సంకట నాశన గణేశ స్తోత్రం భక్తి శ్రద్ధ విశ్వాసాలతో పఠిస్తే, శ్రీ గణేశ అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. ఎవరికి వారు స్వయంగా, అనుభవపూర్వకంగా తెలుసుకోవచ్చు. ప్రతీరోజూ ఈ మహామహిమాన్వితమైన స్తోత్రాన్ని పఠించి, గణేశ అనుగ్రహం పొందుదాం🙏🌼🌿


🌿🌼🙏ఈ సంకట నాశన గణేశ స్తోత్రం ప్రతీరోజూ పఠిస్తే శ్రీ గణేశుని అనుగ్రహం వలన అన్ని సంకటాలు తొలగిపోతాయి🙏🌼🌿


🌿🌼🙏సంకట నాశక గణేశ స్తోత్రము - సంపూర్ణ అర్ధము🙏🌼🌿


 🌿🌼🙏నారద ఉవాచ🙏🌼🌿


*ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకమ్ |*

*భక్తావాసం స్మరేనిత్యం ఆయుష్కామార్థసిద్ధయే || 1 ||*


🌿🌼🙏దేవతలందరికంటే  ముందుగా పూజిపబడే వాడు, గౌరీ తనయుడు, విఘ్నాధిపతీ ఐన గణపతిని సకల సుఖ సౌభాగ్య ధన ధాన్య ఐశ్వర్య ఆరోగ్య వృద్ధి కొరకు సదా  నమస్కరిస్తూ భక్తి శ్రద్ధలతో ఆరాధించెదను🙏🌼🌿


*ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకమ్ |*

*తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్థకమ్ || 2 ||*


ప్రధమ నామం : వక్రతుండ (ఒంపు తిరిగిన తొండము కలవాడు),


 ద్వితీయ నామం: ఏకదంత (ఒకే దంతము కలవాడు), 


తృతీయ నామం: కృష్ణపింగాక్ష (ముదురు గోధుమ రంగు కన్నులవాడు),


చతుర్థ నామం: గజవక్త్ర (ఏనుగు ముఖము వంటి ముఖము కలవాడు).


*లంబోదరం పంచమం చ షష్ఠం వికటమేవ చ |*

*సప్తమం విఘ్నరాజేంద్రం ధూమ్రవర్ణం తథాష్టమమ్ || 3 ||*


పంచమ నామం: 


లంబోదరం (పెద్ద పొట్ట కలవాడు), 


షష్టమ నామం: వికట (భారీ కాయము కలవాడు), 


సప్తమ నామం: విఘ్నరాజా (విఘ్నాలను తొలగించేవాడు), 


అష్టమ నామం: ధూమ్రవర్ణ (ముదురు గచ్చకాయ రంగు కలవాడు).


*నవమం బాలచంద్రం చ దశమంతు వినాయకమ్ |*

*ఏకాదశం గణపతిం ద్వాదశం తు గజాననమ్ || 4 ||*


నవమ నామం: బాలచంద్ర (చంద్రుని శిరస్సుపై ధరించేవాడు), 


దశమం: వినాయక (విఘ్నములకు నాయకుడు)


 ఏకాదశ నామం: గణపతి (దేవగణములకు అధిపతి) 


ద్వాదశ నామం: గజానన (ఏనుగు ముఖము కలవాడు).


*ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః |*

*న చ విఘ్నభయం తస్య సర్వసిద్ధికరః ప్రభుః || 5 ||*


*విద్యార్థీ లభతే విద్యాం ధనార్థీ లభతే ధనమ్ |*

*పుత్రార్థీ లభతే పుత్రాన్మోక్షార్థీ లభతే గతిమ్ || 6 ||*


🌿🌼🙏ఈ ద్వాదశ (పన్నెండు) నామముల శ్లోకం భక్తి శ్రద్ధలతో ధ్యానించడం వలన జ్ఞానము కోరుకున్నవారికి జ్ఞానము, ధనధాన్యములు కోరుకున్నవారికి ధనధాన్య వృద్ధి, పుత్ర సంతాన ప్రాప్తి కోరుకునేవారికి పుత్ర సంతానము మరియు మోక్ష సిద్ధి కోరుకునేవారికి మోక్షము సిద్ధించును🙏🌼🌿


*జపేద్గణపతిస్తోత్రం షడ్భిర్మాసైః ఫలం లభేత్ |*

*సంవత్సరేణ సిద్ధిం చ లభతే నాత్ర సంశయః || 7 ||*


🌿🌼🙏ఈ సంకట నాశన గణపతి స్తోత్రం ఆరు మాసాలపాటు జపించినవారికి కోరిన ఫలములు లభించును. ఒక సంవత్సరం పాటు జపించిన వారికి అనుకున్న పనులలో తప్పక విజయం సాధించగలరు అనే విషయంలో ఏమాత్రం సందేహం లేదు🙏🌼🌿


*అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ లిఖిత్వా యః సమర్పయేత్౹౹*

*తస్య విద్యా భవేత్సర్వా గణేశస్య ప్రసాదతః || 8 ||*


🌿🌼🙏ఈ సంకట నాశన గణేశ స్తోత్రం భక్తి శ్రద్ధలతో రాసి ఎనమండుగురు బ్రాహ్మలకు దానం చేసినయెడల ఆ వినాయకుని కృపకు పాత్రులై సకల జ్ఞానములు సిద్ధించును🙏🌼🌿


🌿🌼🙏అందరం భక్తితో " ఓం గం గణపతయే నమః " అని వ్రాసి స్వామి వారి అనుగ్రహం పొందుదాం ... ఎంత ఆర్తితో స్మరిస్తే అంత త్వరగా అనుగ్రహిస్తాడు ఆ భగవంతుడు🙏🌼🌿


ఓం గం గణపతయే నమః ఓం గం గణపతయే నమః ఓం గం గణపతయే నమః ఓం గం గణపతయే నమః ఓం గం గణపతయే నమః ఓం గం గణపతయే నమః ఓం గం గణపతయే నమః ఓం గం గణపతయే నమః ఓం గం గణపతయే నమః ఓం గం గణపతయే నమః ఓం గం గణపతయే నమః ఓం గం గణపతయే నమః ఓం గం గణపతయే నమః ఓం గం గణపతయే నమః ఓం గం గణపతయే నమః ఓం గం గణపతయే నమః

Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat