అజాయ లోక త్రయ పావనాయ భూతాత్మనే గోపతయే వృషాయ!
సూర్యాయ సర్గప్రలయాలయాయ నమో మహాకారుణికోత్తమాయ!!
వివస్వతే జ్ఞానభృదంతరాత్మనే జగత్ప్రదీపాయ జగద్దితైషిణీ!
స్వయంబువే దీప్త సహస్ర చక్షుషే సురోత్తమాయామితతేజసే నమః!!
నమః సవిత్రే జగదేక చక్షుషే జగత్ప్రసూతి స్థితి నాశహేతవే!
త్రయీమయాయ త్రిగుణాత్మ ధారిణే విరించ నారాయణ శంకరాత్మనే!!
అజుడు, లోకత్రయపావనుడు, సర్వ ప్రాణిస్వరూపుడు, కిరణాధిపతి, ధర్మరూపుడు, సర్గప్రళయాశ్రయుడు, పరమదయామయులలో ఉత్తముడు అయిన సూర్యునకు నమస్కారం. జ్ఞానుల అంతరాత్మ, జగత్ప్రదీపం, లోకహితకాంక్షి, స్వయంభువుడు, వేయి వెలుగుల కన్నులవాడు, దేవతాశ్రేష్ఠుడు, అమితతేజస్వి అయిన సూర్యునకు నమస్కారం. జగత్తున కంతటికి కన్నువంటివాడు, లోకాల పుట్టుకకూ, స్థితికీ, ప్రళయానికీ కారణమైనవాడు, వేదత్రయస్వరూపుడు, త్రిగుణాలను ధరించి బ్రహ్మ, విష్ణు, మహేశ్వర రూపాలతో ప్రసిద్ధుడూ అయిన సవితకు నమస్కారం!!
భక్తులు నిరంతరమూ జపించదగిన, వసిష్ఠుడు చేసిన సూర్యస్తుతి!
*ఓం ఆధిత్యాయ నమః*