దశావతారములు - అంతరార్ధం

P Madhav Kumar


8 పురాణములకు ఆధ్యాత్మికంగా నమస్కరిస్తూ, విజ్ఞానపరంగా పరిశీలిస్తే ఇందులో సృస్తి పరిణామక్రమం, మనిషి జీవినవిధానం అర్ధమవుచున్నది.

1) మత్స్య (చేప): మొదట నీరు ఏర్పడినది.(నేటి ఆధునిక విజ్ఞానం ప్రకారం కుడా భూమిపైన మొదట అంతా నీరే ఉండేది. కాబట్టి మొదట జలచరాలు ఏర్పడ్డాయి).

2) కూర్మం (తాబేలు): ఇది ఉభయచరం. అనగా భూమిపైన, నీటిలో రెండింటిలో సంచరిస్తుంది.

3) వరాహ (పంది): ఇది భూమిపై మాత్రమే సంచరిస్తుంది. భూమిపైన జీవరాసుల ఉత్పత్తి గురించి ఇక్కడ కనిపిస్తుంది.

4) నరసింహా: ఇక్కడ మానవుల మొదటిదశ వర్ణింపబడినది. ఇక్కడ మనిషి ఇంకా పరిపూర్ణ రూపం పొందలేదు.

5) వామన: మానవులు మొదట మారుగుజ్జులుగా ఉండడాన్ని సూచిస్తుంది.

6)పరశురామ: ఇచ్చట మనిషి యొక్క ఆవేశ ప్రవృత్తిని తెలుపుతుంది.(అనగా చెప్పినది ఆలోచించకుండా చేయడం)

7) శ్రీరామ: ఇక్కడ మనిషి తనకన్నా సమాజానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం గమనించవచ్చు.

8) శ్రీకృష్ణ: ఇక్కడ మనిషి సమాజంలోఎలా జీవించాలో తెలుసుకున్నాడని చెప్పడం జరిగింది.

9)బుద్ధ/బాలరామ: అన్ని సుఖాల మరియు అనుభవాల తర్వాత మనిషి వైరాగ్యభావంతో జీవించడాన్ని సూచిస్తుంది.

10)కల్కి: ఈ అవతారం ఇంకా రాలేదు  కాబట్టి ఆ పరమాత్మ దీన్నీీ నిర్ణయించాలి. 

రచయత: జంపని శ్రీనివాస మూర్తి గారు

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat