పవిత్రోపాన ఏకాదశి లేదా పుత్రదా ఏకాదశి.
శ్రావణ మాసములో వచ్చే విశిష్టమైన తిథి శ్రావణ శుక్ల ఏకాదశి.
పరమపావనమైన ఈ రోజున ఇంటిలో లక్ష్మినారాయణులను భక్తితో పూజించి, పాలను నైవేద్యంగా ఉంచి, విష్ణు సహస్రనామములను, విష్ణు అష్టోత్తరములను పారాయన చేసి, పాలు, పండ్ల వంటి సాత్వికాహారం తీసుకొని ఉపవాసం ఉండాలి. దగ్గర్లోని వైష్ణ్వవాలయాన్ని సందర్శించి మరియు ఈ రోజున నిత్య పూజ, ఉపవాసాది కార్యక్రమములను చేయడం ద్వారా విశేషమైన సిరిసంపదలు కలుగుతాయి, సమస్త పాపముల నుండి విడివడి వైకుంఠ ప్రాప్తిని పొందుతారు.
ఈ ఏకాదశిని విష్ణుప్రీతిగా భక్తి, శ్రద్ధలతో చేయడం అశ్వమేధ యాగం చేసిన ఫలితం పొందుతారు మరియు సత్పుత్రుడిని సంతానంగా పొందగలరని శ్రీకృష్ణపరమాత్మ ధర్మరాజుకి బోధించారు ---
బ్రహ్మ వైవత్తర పురాణం.
*చేయవలసినవి:-*
🌱- దగ్గరలోనున్న వైష్ణవ ఆలయాన్ని సందర్శిస్తే విశేషంగా విష్ణు భగవానుడి అనుగ్రహం పొందుతారు.
🌱- రోజంతా కృష్ణ, మాధవ, గోవింద అని హరినామాన్ని జపించండి.
🌱- మద్యపానం , మాంసాహారం వంటి పాపకర్మలకు దూరంగా ఉండండి.
🌱ఏకాదశి రోజున ధాన్యంతో(బియ్యం, గోధుమ, బార్లే వంటివి) చేసిన ఆహారం నిషిద్ధము కావున పాలు, పండ్లు వంటి సాత్వికమైన ఆహారం స్వీకరించవచ్చు.
🌱-శక్తి కొలది దాన, ధర్మాదులు, జప, తపాదులు చేయడం మంచి ఫలితాన్నిస్తుంది.
*హరినామ స్మరణం* -
*సమస్త పాపహరణం*. *శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ ఫలం*
*రేపు పద్మిని ఏకాదశి సందర్భంగా...*
_*భగవద్గీత పారాయణం మరియు విష్ణు సహస్రనామాలను పారాయణ చేయండి...*_
భగవద్గీత పారాయణం వలన అనేక ఫలితాలు కలుగుతాయని భగవానుడే స్వయంగా గీతా పఠన మహాత్మ్యాన్ని భూదేవికి వివరించాడు. గీతా పఠనం వలన పాపాలు నశించి ఉత్తమోత్తమైన ఫలితాన్ని, ఉత్తమ గతిని పొందుతారు.
మానవజన్మ కర్తవ్యం గురించి వేదాలు, శాస్త్రాలు, పురాణాలు, ఉపనిషత్తులు, ఎంతగానో ఘోషించాయి. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర్యాలకు స్వల్పమైన ఈ జీవితాన్ని వ్యర్థ పరచక భగవత్ సేవలో నిమగ్నమై జీవితాన్ని సార్థకం చేసికోవాలి. ఈ స్వల్పమైన జీవితకాలంలో మానవుడు, సత్ప్రవర్తనపరుడై జీవితాన్ని చరితార్థం చేసుకోవాలి. సృష్టికర్తయైన ఆ భగవంతుడే అవతార రూపమున మానవుడై జన్మించినప్పుడు అతని జన్మకు కూడా మరణం ఉంటుంది. అలాగే సృష్టిలో జన్మించిన ప్రతిజీవికి మరణం అనివార్యం అనే సత్యాన్ని బోధిస్తుంది భగవద్గీత. భగవంతుడు సర్వాంతర్యామి, నిరాకారుడు, నిర్గుణుడు. అన్ని రూపాలు అతనివే. భగవంతుని ఏ రూపంలోనైన ఆరాధించవచ్చును.
⚜️ శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం వల్ల కలిగే లాభాలు పారాయణం ప్రతి రోజు చెయ్యడం వలన అద్భుతాలు జరుగుతాయి.
⚜️ మహా విష్ణు దేవతలందరి లో ఉత్తమోత్తమైన దేవుడు.. సర్వోపగతుడు. ఇందు లేడందు సందేహమ్ము వలదు..చక్రీ సర్వోపగతుండు.ఆ దేవాది దేవుడినుండే అన్ని దేవతల సాక్షాత్కారము జరుగును.
⚜️ ప్రతి రోజు విష్ణు నామ పారాయణం జపం చేసినట్టయితే.. జీవితంలో ఉన్నత స్తానానికి చేరుకోవచ్చు. అదృష్ఠం కలుగుతుంది.. రాజ యోగం కలుగుతుంది.
⚜️ పితృ దోషాలు కనుమరుగవుతాయి. గత జన్మ పాపాల నుండి విముక్తి కలుగుతుంది. తద్వారా దారిద్ర ఇతి బాధలు కనుమరుగవుతాయి.
⚜️ జ్ఞానానికి మోక్షానికి దగ్గర దారి శ్రీ మహా విష్ణు ఆరాధన. ఏవరైతే ప్రతి నిత్యం బ్రహ్మ ముహూర్తములో రావి వృక్షం దగ్గర శ్రీ విష్ణు సహస్ర నామం పారాయనం గావిస్తారో వారి సంకల్పం సిద్దిస్తుంది. మానసిక సమస్యలు తగ్గి వారి మనస్సు దృఢమై కార్యోణ్ముక్తుడిని చేస్తుంది.
⚜️ మోక్షానికి సులభ మార్గం శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం.
⚜️ ఎవరైతే ప్రతి నిత్యం వింటారో వారి మానసిక, శారీరక బాధలు తగ్గి సుఖ జీవనం లభిస్తుంది.
⚜️ ప్రతి నిత్య పారాయణం వల్ల వారికి రక్షణ కవచం సుదర్శన శక్తి లభిస్తుంది. మనసులోని చెడు ఆలోచనలు తొలగిపోతాయి. అంత: శతృవులు నశిస్తారు.
⚜️ శ్రీ విష్ణు సహస్ర నామ పారాయణం వల్ల నవ గ్రహ దోషాలు తొలగి, వాక్షుద్ది కలుగుతుంది. జ్ఞానం వృద్ది నొందుతుంది.తద్వారా దేవుని సాక్షాత్కారం లభిస్తుంది. ......