🌸త్రిలోకసుందరుడు , అనుగ్రహ
వరప్రసాది అయిన తిరువల్లిక్కేణి పార్ధసారధిస్వామివారి మూర్తి భక్తులకు పరవశత్వం కలిగిస్తుంది. ఆలయంలోనిమూలవిరాట్ వేంకట కృష్ణుడు. ఉత్సవమూర్తి పార్ధసారధి గా కటాక్షిస్తున్నాడు. అమ్మవారి పేరు
వేదవల్లి తాయారు. అందమైన తామర పుష్పాలు నిండిన కొలనులెన్నో గల యీ ప్రాంతం ప్రాచీన కాలంలో అల్లిక్కేణిగా పిలువబడేది. పురాణాలలో ఈ ప్రాంతం బృందారణ్య క్షేత్రంగా(తులసి వనం) గా తెలుపబడినది.
🌸ఉత్సవమూర్తి అయినశ్రీ పార్ధసారధి పెరుమాళ్, శ్రీ దేవి,భూదేవీ సమేతంగా కటాక్షిస్తున్నాడు.పార్ధసారధి స్వామివారి దేహం మీద కురుక్షేత్రయుధ్ధంలో భీష్ముడి బాణాలు చేసిన గాయాల మచ్చలు గోచరిస్తాయి.
భీష్ముడి బాణాల వలన కలిగిన బాధ పార్ధసారధిలో ఇంకా పూర్తిగా అణగారలేదు. అందుకే స్వామివారి నివేదనకు పూర్తిగా నెయ్యినే ఉపయోగిస్తారు.నూనె పదార్ధాలు అధికంగా చేర్చరు.వంటలలో మిరపకాయలకి బదులుగా మిరియాలు వాడుతారు.
🌸తిరువళ్ళిక్కేణి పార్ధసారధిస్వామి మూడు భంగిమలతో దర్శనమిస్తాడు.
నిలబడిన భంగిమలో వేంకటకృష్ణుని
దర్శిస్తాము. ఆశీనుడైన భంగిమలో శ్రీతెళ్ళియ సింగర్(నరసింహుడు) ;
శయన భంగిమలో మణ్ నాదరు అని కీర్తించబడేశ్రీరంగనాధుడుకొలువై వున్నారు. ఇంకా, శ్రీ వరదరాజస్వామి మరియు చక్రవర్తి తిరుమగన్ మొదలైనవారి
విగ్రహాలు కూడా దర్శనమిస్తాయి. పేయాళ్వారు శిష్యుడైన తిరుమలిశైయాళ్వారు
కొన్ని సంవత్సరాలపాటుతిరువల్లిక్కేణి లో నివసించారు.
🌸భాష్యకారులు
శ్రీ ఆళ్వాన్దారు, శ్రీ వేదాంతాచార్యులు,
సంగీత మేధావులైన సద్గురు త్యాగరాజస్వామి, శ్రీ ముత్తుస్వామి దీక్షితులువారు మొదలైన మహానుభావులెందరోయీ ఆలయాన్ని దర్శించి తరించారు.