హిందువుల ఆలయాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. చరిత్రలో మన ఆలయాలకు ఎప్పటికీ నిలిచిపోతావు. వాటి కట్టడాలు కానీ విగ్రహాలు కానీ ప్రతిదీ ప్రత్యేకమే. గుడికి వెళ్లేప్పుడు చక్కగా స్నానం చేసి మంచి దుస్తులు వేసుకుని వెళ్లాలి అంటారు. అలాగే గుడికి వెళ్లేముందు మాంసాహారం తినకూడదని మన ఇంట్లో వాళ్లు చెప్తారు. అవును కదా.. మీరు కూడా చికెన్, మటన్ తిని గుడికి వెళ్లడానికి ఇష్టపడరు. ఎందుకు అట్లా..? ఏదైనా పర్టిక్యులర్ రీజన్ ఉందంటారా..?
ఆలయాలకు పరిశుభ్రంగా, ప్రశాంతంగా వెళ్లే సంప్రదాయం ఉంది. గుడికి వెళ్లేటప్పుడు సాధారణంగా తలస్నానం చేసి లేదా పుణ్యనదులలో స్నానం చేసి, శుభ్రమైన దుస్తులు ధరిస్తాం. కొందరు ఖాళీ కడుపుతో అంటే ఏమీ తినకుండా గుడికి వెళ్తే, మరికొందరు సాత్విక ఆహారం తీసుకున్న తర్వాతే గుడికి వెళతారు. అయితే మాంసాహారం తిన్న తర్వాత గుడికి వెళ్లడం తప్పు చేసినట్టు పరిగణిస్తారు. దీనికి కారణం ఏంటంటే..
ఉదాహరణకు మధ్యాహ్నం పెరుగు తింటే మంచి నిద్ర పడుతుంది. కొంత సేపు హాయిగా ఎక్కడైనా పడుకోవాలని అనిపిస్తుంది. కాబట్టి మీరు మాంసాహారం తిన్నప్పుడు మీ శరీరం, మనస్సు కొద్దిగా అలసిపోయినట్లుగా, మందగించినట్లు అనిపిస్తుంది. అలాంటప్పుడు మీరు ఆలయానికి వెళితే అక్కడి సానుకూల ప్రకంపనలను అనుభవించడానికి మీ మనస్సు, శరీరం అంగీకరించవట. మాంసాహారంలో తామసిక గుణాలు ఎక్కువగా ఉన్నందున, మీ మనస్సు మంచి ఆలోచనలు, ప్రకంపనలను అనుభవించడానికి అనుమతించదు.
మాంసాహార భోజనంలో కొవ్వు, ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ జీవక్రియను, శారీరక అవసరాలను పెంచుతాయి. అయితే మీ అంతర్గత ప్రశాంతతకు భంగం కలిగిస్తాయి. మతపరమైన ఆచారాల్లో అంతర్గత ప్రశాంతతకు, ఏకాగ్రతకు గొప్ప ప్రాముఖ్యం ఇచ్చారు. శాఖాహార భోజనంలో కూడా ఉల్లిపాయలు, వెల్లుల్లి, ఇతర కూరలు, పలు రకాల మసాలాలు వంటి మసాలా దినుసులకు దూరంగా ఉండాలని పండితులు చెప్తారు.
మన పూర్వీకులు వీటన్నింటిని ముందే గ్రహించి ఎన్నో నియమాలను పెట్టారు. మనం వాటి వెనుక ఉన్న అర్థాన్ని తెలుసుకోక ఇదంతా ట్రాష్ అని కొట్టిపడేస్తుంటాం.