ఇతడే పరబ్రహ్మ మిదియె రామకథ |

P Madhav Kumar


లిరిక్స్ : Pallavi:

|| ఇతడే పరబ్రహ్మ మిదియె రామకథ |

శతకోటి విస్తరము సర్వపుణ్య ఫలము ||


Charanams:

|| ధరలో రాముడు పుట్టె ధరణిజ బెండ్లాడె |

అరణ్య వాసులకెల్ల నభయమిచ్చె |

సొరిది ముక్కుజెవులు చుప్పనాతికిని గోసె |

ఖరదూషణులను ఖండించి వేసె ||


|| కినిసి వాలి జంపి కిష్కింద సుగ్రీవుకిచ్చె |

వనధి బంధించి దాటె వానరులతో |

కవలి రావణ కుంభకర్ణాదులను జంపి |

వనిత జేకొని మళ్ళివచ్చె నయోధ్యకును ||


|| సౌమిత్రియు భరతుడు శత్రుఘ్నుడు గొలువగ |

భూమి యేలె కుశలవ పుత్రుల గాంచె |

శ్రీమంతుడై నిలిచె శ్రీవేంకటాద్రి మీద |

కామించి విభీషణు లంకకు బట్టముగట్టె ||🙏🙏🙏

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat