ధూమావతి ఆరాధన
ఎన్నో రకాల చెడు కర్మలకు గొప్ప పరిహార సాధన ,ఈ తల్లిని అనేక రకాల జబ్బులను దూరం చేస్తుంది, గ్రహ దోషాలను
తొలగిస్తుంది, కవిత్వం సిద్ధిస్తుంది, ముఖ్యంగా వ్యాపార రంగంలో నష్టపోయి
ఆప్పులలో కూరుకుపోయి దిక్కుతోచని దౌర్భాగ్య స్థితినుండి రక్షిస్తుంది,
ఉపాసకుడి యొక్క దురదృష్టాన్ని ఆమె చేతిలో ని చేట చీపురతో ఊడ్చుకొని పోతుంది
ఈమె సాధన సిద్దించి ఈ తల్లి అనుగ్రహిస్తే వారి జీవితంలో లోటు ఉండదు..
ఏమని కోరుకొని సంకల్పించాలి:
ఒక ముఖ్యమైన విషయం గుర్తు పెట్టుకోవాలి ఈమెను ఏది కావాలి అని అడగకూడదు
డబ్బు కావాలి ఉద్యోగం కావాలి ఇలా ఏది కూడా అడగకూడదు.. నా సమస్యలు పోవాలి నా
బాధలు తొలగిపోవాలి నా అప్పుల బాధలు కోర్ట్ సమస్యలు పోవాలి... మానసిక
ఆందోళన తొలగి పోవాలి.. వివాహ దోషం పోవాలి, గర్భ దోషం పోవాలి ,ఇలా ఏదైతే
మీకు బాధ కలిగిస్తోంది అది మీకు దూరమైపోవాలి అని కోరుకుంటే నే ఈమె
కరునిస్తుంది ఈ సాధన ఫలిస్తుంది.
ఎలా చేయాలి ఏ సమయంలో చేయాలి.
ఈ ఉపాసన ఎప్పుడు రాత్రి సమయంలోనే చేయాలి అప్పుడే ఫలితం ఉంటుంది, రాత్రి 11
గం మొదలు పెట్టాలి ఈ మంత్రాన్ని 21 సార్లు గాని 51 సార్లు కానీ 108 సార్లు
ఇలా ఎదో ఒక సంఖ్య ని నిర్ణయించుకుని ఒకే సమయంలో రోజూ మొదలు పెట్టాలి..
- * ఈ జపం రెండు విధాలుగా సాధన చేస్తారు మొదటి పద్దతి రోజు ఇన్నిసార్లు అని నియమించుకుని పదివేలు జపం చేస్తే ఈ మంత్రం సిద్ధిస్తుందిసమస్యలు తగ్గిపోతుంది. తర్వాత ఏ సమస్య రాకుండా మనసులో ఈ మంత్రాన్ని జపించుకోవచ్చు.
- * ఇంక రెండో పద్దతి ఈ మంత్రాన్ని రోజూ రాత్రి 11 గం 108 సార్లు జపం చేస్తూ 41 రోజులు చేస్తారు ఇలా చేసిన మీ సమస్య తీరిపోతుంది.
- * ఫోటో ఉండాల్సిన పని లేదు నివేదన పెట్టి చేయాలని నియమం లేదు శుభ్రంగా ఉన్న ఎక్కడైనా కూర్చుని ఈ శ్లోకం జపించవచ్చు అయితే భక్తిగా చేయాలి..
ఈ సాధన చేస్తున్న వారు రోజు ఉదయం మీ మనసులో సమస్య తలుచుకుని కాకులకు అన్నం
పెడితే మంచిది. మీ జపం 41 రోజులు పూర్తి అయినా, లేక పది వేల జపం పూర్తి
అయిన తర్వాత పెద్దవయసు ఉన్న భర్త లేని వృద్ధురాలు పేద వారు అయిన ఒక స్త్రీ
ని ఆ తల్లిగా భావించి చీర పండ్లు దక్షణ, ఇవ్వాలి.. మీకు ఉన్న అన్ని సమస్యలో
ఒక్కోటి జపం చూస్తుండగానే తీరుతూ వస్తుంది.. మొండిగా ఉన్న పిల్లల కోసం.
కూడా తల్లితండ్రులు రాత్రి ఈ శ్లోకమ్ 21 మారు చదివి ఉదయం పిల్లలో ఉన్న
మొండితనం కోపం తీసుకుని పో అని చెప్పి కాకికి అన్నం పెడుతూ ఉంటే పిల్లలోను
మంచి మార్పు వస్తుంది.
ఈ సాధన చేస్తున్న వారికి ఎన్నో నిదర్శనలు తెలుస్తూ ఉంటుంది దానికి
బయపడకూడదు కలలో విచిత్ర ఆకారంలో కనిపిస్తారు.. జపం చేసే ప్రాంతంలో తీవ్రమైన
దుర్వాసన వస్తుంది ఒక్కోసారి, అప్పుడు జపం అపకూడదు కలలో ఎవరో
చావగొట్టినట్టు కనిపిస్తుంది.. మీరు ఆ తల్లికి ఒక్కటే సంకల్పంగా
చెప్పుకోవాలి నా సమస్యలు తీసుకొనిపో నా దుక్కాన్ని తీసుకుని పో అని అదే
కోరుకోవాలి.. అవన్నీ పోతే మీకు సంతోషం వస్తుంది..
విధవరాలు రూపంలో ఉన్న ఈ తల్లి కూడా పార్వతీ స్వరూపం ఈమె చూడటానికి ఇలా
ఉన్నా సకల సౌభాగ్యాలు అనుగ్రహిస్తుంది..ఈమెను ఉపాసించే ఆడవాళ్లకు వైధవ్యం
కలగదు అనారోగ్యంతో ఉన్న భర్త జబ్బుని తీసుకుని పో అని ఈమె కు జపం చేయాలి.
అలాగే ఈ సాధన స్త్రీలు పురుషులు ఎవరైనా చేయవచ్చు.. ఇందులో బీజ మంత్రాలు మూల
మంత్రాలు లేవు కనుక ఉపదేశంతో అవసరం లేదు. స్త్రీలు ఆటంకం సమయంలో ఆపి
తర్వాత కొనసాగించాలి.
🕉 సౌభాగ్యదాత్రీ ధూమావతీ కవచమ్ 🕉
ధూమావతీ ముఖం పాతు ధూం ధూం స్వాహాస్వరూపిణీ |
లలాటే విజయా పాతు మాలినీ నిత్యసున్దరీ ||
కళ్యాణీ హృదయం పాతు హసరీం నాభి దేశకే |
సర్వాంగం పాతు దేవేశీ నిష్కలా భగమాలినీ ||
సుపుణ్యం కవచం దివ్యం యః పఠేద్భక్తి సంయుతః |
సౌభాగ్యమతులం ప్రాప్య జాతే దేవీపురం యయౌ ||
|| శ్రీ సౌభాగ్య ధూమావతీకల్పోక్త ధూమావతీ కవచమ్ ||
(ఈ కవచం రోజూ రాత్రి 11 గం సమయంలో మొదలు చేయాలి).
🌷శ్రీ మాత్రే నమః🌷
సంకలనం: భానుమతి అక్కిశెట్టి