లక్ష్మీ గాయత్రి మంత్రం - Lakshmi Gayatri Mantram

P Madhav Kumar

 లక్ష్మీ గాయత్రి మంత్రం - Lakshmi Gayatri Mantram


లక్ష్మీ గాయత్రి మంత్రం
॥ ఓం శ్రీ మహాలక్ష్మ్యై చ విద్మహే విష్ణు పత్నయై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ ఓం ॥

అనువాదం :
శ్రీ అయిన తల్లి మరియు మహావిష్ణువు భార్య అయినా ఓ లక్ష్మీదేవీ, మీకు నమస్కరిస్తున్నాం. మమ్మల్ని మేధస్సు, సంపద మరియు అదృష్టంతో దీవించండి.


మహాలక్ష్మి మంత్రం
ఓం సర్వబాధా వినిర్ముక్తో, ధనధాన్య సుతాన్వితా।
మనుష్యో మత్ప్రసాదేన భవిష్యతి నసంశయా ఓంl

అనువాదం :
ఓ మహాలక్ష్మీ, చెడునంతా అంతం చేసి మమ్మల్ని కాంతివంతమైన, సుఖసంతోషాలతో కూడిన భవిష్యత్తులోకి నడిపించు.

శ్రీ దక్షిణ లక్ష్మీస్తోత్రం
'త్రైలోక్య పూజితే దేవే కమల విష్ణు వల్లభే
యయతవం అచల కృష్ణే తథాభవమయి శ్రితా |
కమల చంచల లక్ష్మీ చలాభూతిర్ హరిప్రియ
పద్మ పద్మాలయ సమ్యక్ ఉచై శ్రీ పద్మ ధరణీ |

ద్వాదశైతాని నామాని లక్ష్మీ సంపూజ్య యః పఠేత్
స్థిర లక్ష్మిర్భవేత్ తస్య పుత్రధర అభీశః ||

అనువాదం :
ఓ మహాలక్ష్మీ, నీవు ముల్లోకాలలో పూజించబడతావు. మహావిష్ణువు పట్టమహిషివి, భగవాన్ శ్రీకృష్ణుడి భార్యవి. ఓ కమలా! నీవు నాతోనే స్థిరంగా ఉండిపోవాలని కోరుకుంటున్నాను. ఓ చంచలమైన దేవతా, సమృద్ధికి అధినేత్రివైన నీవు ఒకచోటి నుంచి మరొకచోటికి వెళ్ళిపోతూనే ఉంటావు. ఓ ప్రియమైన శ్రీహరి, ఓ పద్మావతి, మీరు ఎప్పటికీ ఆహ్లాదకరమైనవారే. సంపదకి అధినేత్రీ, నువ్వు అత్యున్నతమైనదానివి, కమలంలో నివసించేదానివి. లక్ష్మీ అమ్మవారిని 12 పేర్లను నిష్టతో జపించేవారివద్ద నీవు ఎప్పుడూ స్థిరంగా ఉండుగాక. అతనికి భార్యాబిడ్డల సంతోషం కలకాలం దక్కుగాక.||

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat