శుభ ఫలిత మంత్రములు - Mantra Subha Phalitamulu

P Madhav Kumar

 

మంత్ర - పరిహారము

 మంత్రం ఐన గురువు దగ్గర పొంది సాధన చేస్తే ఫలితం వస్తుంది. గురువు లేని విద్య గుడ్డి  విద్య అన్నారు పెద్దలు. గురువు లేకపోతె దక్షిణా మూర్తి దగ్గర మంత్రము రాసి పెట్టి అయన మీకు మంత్రం ఇస్తున్నట్టు భావించి తరువాత సాధన చేయండి.

శత్రు భాధ తొలగి శుభం కలుగుటకు 
ఐం బీజ మాదిందు సమాన దీప్తిం
హ్రీం సూర్యతేజోద్యుతి మద్వితీయం
క్లీం  మూర్తి వైశ్వానర తుల్య రూపం
తౄతీయ ద్యూనంతు శుభామానం

జయాన్నిపొందడానికి 
అఘోర నృసింహ మంత్రం .
ఓం హ్రీం క్ష్రౌం  ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం.
స్ఫుర స్ఫుర ప్రస్ఫుర ప్రస్ఫుర  ఘోర ఘోరథన థనూరూప చ్చట చ్చట  ప్రచట ప్రచట కః కః  వామ వామ బంధయ బంధయ క్ఖాదయ క్ఖాదయ
నృసింహం భీషణం భద్రం మృత్యుమృత్యుర్ నమామ్యహం స్వాహా

నవగ్రహ పీడా పరిహారము. జాతకంలోని గ్రహదోష నివృత్తికి, గోచార గ్రహదోష నివృత్తికి ఈ పాశుపత మంత్రము అత్యంత ఫలదాయి. 
ఓం క్లీం శ్రీం ఐం హ్రీం గ్లౌం రం హుం ఫట్‌

ఇష్టకన్యాప్రాప్తి, వివాహము కాని పురుషులకు తొందరగా వివాహం అవటం ఫలములుగా చెప్పబడ్డాయి. 
ఓం పావీ రవీ కన్యా చిత్రాయుస్సరస్వతీ వీరపత్నీధియంధాత్‌ ।
జ్ఞ్నాభిరచ్చిద్రగo శరణగo సజోషా దురాద్ష్రం గృణతే శర్మయగo సత్‌ ।।

ఇష్ట వర ప్రాప్తి, వివాహం కాని కన్యలకు శీఘ్రముగా వివాహం జరుగుటకు మంత్రము:
ఓం క్లీం నమో భగవతే గంధర్వరాజ విశ్వావసో మమాభిలషితం వరక్షిప్రం ప్రయచ్ఛ స్వాహా।।

బుణ బాధనుంచి విముక్తి (అప్పుల భాద తగ్గుటకు)
ఆనృణా అస్మిన్ననృణాః పరస్మిగ్గ్‌ న్తృతీయే లోకే అనృణాస్యామా!
యే దేవయానా ఉత పితృయాణా సర్వాంపథో అన్నణా ఆక్షియేమ!!

సంతాన ప్రాప్తి
ఓం కాణ్డాత్కాణ్డాత్ప్రరోహంతీ పరుషః పరుషః పరీ!
ఏవానో దూర్వే ప్రతను సహస్రేణ శతేనచ

అపమృత్యు దోషమునకు 
ఓం హౌం ఓం జూం ఓం సః ఓం భూః ఓం భువః ఓం స్వః
ఓం త్య్రంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం ।
ఉర్వారుక మివ బంధనాన్మృత్యోర్ముక్షీయమామృతాత్‌ ।।
ఓం స్వః ఓం భువః ఓం భూః ఓం సః ఓం జూం ఓం హౌం ఓం స్వాహా।
ఈ మంత్రముతో 169 రుద్ర మంత్రములను సంపుటితము చేసిన యెడల అది అమృత పాశుపతమగును.
అభిషేక ద్రవ్యము: అభిషేకము కొరకు పంచామృతములు, పూజ కొరకు బిల్వ పత్రములు.
ఫలము: ఈ పాశుపతము అన్నింటిలోకి ముఖ్యమైనది. ఇది అపమృత్యు హరము. సకల ఐశ్వర్య ప్రదము.

గురుగ్రహ దోష నివారణకు హయగ్రీవస్తోత్రం
జాతకంలో గురుగ్రహ దోషం ఉన్నవారు ప్రతిరోజు హయగ్రీవ స్తోత్రం చదివితే గురుగ్రహ
అనుగ్రహం కలుగుతుంది. భక్తి బావనలు, ఉన్నత విద్య, విదేశీ విద్య కలగాలంటే గురుగ్రహ అనుగ్రహం ఉండాలి.

గురుగ్రహానికి అధిదేవత హయగ్రీవుడు. సకల విద్యాధి దేవతయైన శ్రీమన్నారాయణుడు ‘హయగ్రీవుని’గా అవతరించాడు.

సరస్వతీదేవి, వేదవ్యాసుడు హయగ్రీవుని నుండి విద్యాశక్తిని సముపార్జించారని ‘హయగ్రీవ స్తోత్రం’లో దేశికాచార్యులు పేర్కొన్నారు.హయగ్రీవోపాసన వాక్‌శక్తిని, విద్యాశక్తిని, జ్ఞానశక్తిని సిద్ధింపచేస్తుంది.

జ్ఞానానంద మయం దేవం, నిర్మలాస్ఫటికాకృతమ్.
ఆధారం సర్వ విద్యానాం, హయగ్రీవ ముపాస్మహే..!!

జ్ఞానం, ఆనందం, మూర్త్భీవించిన దైవస్వరూపం హయగ్రీవుడు. నిర్మలమైన స్ఫటికాకృతి కలిగి సర్వవిద్యలకు ఆధారభూతమైన విద్యాధిదేవత హయగ్రీవునకు నమస్కారము.

హయగ్రీవుని పూజించడంవల్ల విద్య, ఐశ్వర్యం, అధికారం, ఆయువు మొదలైనవన్నీ లభిస్తాయి. విద్యార్థులు హయగ్రీవుని పూజించడంవల్ల చదువు బాగా వస్తుంది. పిల్లలున్న ఇంట హయగ్రీవ పూజ పిల్లలకు విద్యాటంకాలు తొలగించి, ఉన్నత విద్యను అందిస్తుంది.

హయగ్రీవస్తోత్రం.
హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి వాదినం |
నరం ముంచంతి పాపాని దరిద్రమివ యోషితః ||

హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోపదేత్ |
తస్య నిస్సరతే వాణీ జహ్నుకన్మా ప్రవాహవత్ ||

హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోధ్వనిః |
వి శోభతే చ వైకుంఠ కవాటోద్ఘాటన ధ్వనిః ||

ఫలశ్రుతి :
శ్లోకత్రయ మిదం దివ్యం హయగ్రీవ పదాంకితం |
వాదిరాజయత్రిప్రోక్తం
 పఠతాం సంపదాంప్రదం ||

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat