రాహుకాలం ప్రతినిత్యం వస్తుంది. ఒక్కోరోజు ఒక్కొక్క సమయంలో రాహుకాలం వస్తుంది. రోజూ ఒకటిన్నర గంటల రాహుకాలం వుంటుంది. ఈ సమయాన్ని పూజకొరకు కేటాయించాలని హిందూ భావన. అందువల్ల ఈ రాహుకాలంలో ముఖ్యమైన కార్యక్రమములు ఎవరూ చేయరు, ప్రారంభించరు.
తమిళులు ఎక్కువగా రాహుకాలంలో పూజ చేస్తారు. ప్రత్యేకించి దుర్గాదేవి పూజ రాహుకాలంలో చేస్తే అధిక ఫలితం లభిస్తుంది. రోజూ చేయలేనివారు కనీసం శుక్రవారము రోజున రాహుకాలంలో అర్చన చేసినా ఫలితం లభిస్తుంది.
దినసరి రాహుకాల సమయ పట్టిక: వారము సమయము మొదలు - వరకు
ఆదివారము సాయంత్రం 4.30 - 6.00
సోమవారము ఉదయం 7.30 - 9.00
మంగళవారము మధ్యాహ్నం 3.00 - 4.30
బుధవారము మధ్యాహ్నం 12.00 - 1.30
గురువారము మధ్యాహ్నం 1.30 - 3.00
శుక్రవారము ఉదయం 10.30 - 12.00
శనివారము ఉదయం 9.00 - 10.30
రాహు కాలాన్ని సులబముగా గుర్తించు మార్గము:
ఈక్రింది శ్లోక పాదాన్ని గమనించండి. సోమ శని శుక్ర బుద గురు మంగళాది. ప్రతి దినము రాహుకాలము ఒక గంటా 30 నిముషాలుంటుంది. అది సోమవారము ఉదయం 7-30 నిముషాలకు ప్రారంబమై వరుసుగా ఈ శ్లోక పాద క్రమంలో సాగి ఆదివారం సాయంత్రం 6.00 గంటలకు ముగుస్తుంది. పైన చెప్పిన శ్లోక పాదాన్ని గుర్తు పెట్టుకుంటే ఏరోజు రాహు కాలము ఎప్పుడు అనేది సులభ గ్రహ్యము.