మను ధర్మశాస్త్రము లోని కొన్ని ముఖ్య విషయములు - Some important points in Manu Dharma Shastra !

P Madhav Kumar

 


మను ధర్మశాస్త్రము లోని కొన్ని ముఖ్య విషయములు.

ఇంద్రియాలు :
  ఇంద్రియాలు బలం గలవి కాబట్టి వివేకం గలవారినైనా చెడుదారి కీడువి. కాబట్టి తల్లితోగాని, సోదరితోగాని, కూతరురహ్మచారి బోడిగుండుతోగాని, జలతోగాని ఉండాలి. సూర్యుడస్తమించక ముందు, సూర్యుడు ఉదయించిన తరువాత బ్రహ్మచారి నిద్రింపకూడదు. అలా పొరపాటున నిద్రిస్తే మరునాడు పగలంతా గాయత్రీ జపం చేస్తూ, ఉపవాసం వుండి రాత్రి భోజనం చేయవచ్చు. ఇలా ప్రాయశ్చిత్తము చేసుకోని వాడిని మహాపాపం చుట్టుకుంటుంది.
ధర్మార్థాలు :
  ధర్మార్థాలు కామ హేతువులవడంవల్ల శ్రేష్ఠమైనవని కొందరు అంటారు. అర్థ కామములు సుఖాన్ని కలిగిస్తాయి. కాబట్టి అవి శ్రేష్ఠమయినవని కొందరు అంటారు. ధర్మం, అర్థకామాలకు కారణం కాబట్టి ధర్మం శ్రేష్టమని కొందరు అంటారు. అర్థమే ధర్మకామాలకు హేతువు కాబట్టి అర్థమే శ్రేష్టమని కొందరు చెబుతారు. కాని ధర్మార్థ కామములు మూడూ పురుషార్థములు కాబట్టి అవి శ్రేష్టములని మనువు అభిప్రాయం.
గురువు :
  గురువు సన్నిధానంలో గురువు కంటే మంచి ఆహారం తినకూడదు. గురువు కంటే మంచి బట్టలు కట్టకూడదు. గురువు పడుకోన్నాక పడుకోవాలి. గురువు నిద్ర లేవకముందే నిద్రలేవాలి. గురువును పేరుపెట్టి మాట్లాడకూడదు. గురువులా మాట్లాడి, నడిచి, నటించి అతన్ని వెక్కిరించకూడదు. గురువులను దూషిస్తే తన విద్య యంతయూ నశించును. గురువును ఎవరైనా నిందిస్తుంటే చెవులు మూసుకోవాలి. లేదా వేరొక చోటికి పోవాలి.
శిష్యుడు :
  శిష్యుడు గురువుపై అపవాదు మోపితే గాడిదగా, నిందిస్తే కుక్కగా, గురువు సంపదను అనుభవిస్తే పురుగుగా, గురువును ద్వేషిస్తే కీటకంగా జన్మిస్తారు. గురువునకు గురువు వచ్చినప్పుడు, గురువునకు నమస్కరించినట్లే ఆయనకూ నమస్కరించాలి. గురువు ఇంట్లో ఉండేటప్పుడు తల్లిదండ్రులు వచ్చినా గురువు ఆనతి లేకుండా వారికి నమస్కారం చేయకూడదు.
గురుపత్నులు :
  సజాతీయులైన గురుపత్నులు గురువువలె పూజింపదగినవారు. గురుపత్ని జవరాలై తే యవ్వనంలో వున్న శిష్యుడు ఆమెకు పాదాభివందనం చేయకూడదు. పురుషులను మొహానికి లోనుచేసి వాళ్ళను పతనం చేయడం జవరాలైన ఆ స్త్రీల స్వభావం కాబట్టి, విద్వాంసులు స్త్రీల విషయంలో ఏమరపాటుగా వుండకూడదు. పురుషుడు విద్వాంసుడైనా, అవిద్వాంసుడైనా స్త్రీల వలలో పడటం సహజం. స్త్రీలు కామక్రోధ వశుడైన విద్వాంసుడినైనా, మూఢుడినైనా లొంగదీసి చెడు దారికి ఈడ్వ గలిగినవారు.
ఆచార్యులు :
  ఆచార్యుడు పరమాత్మ స్వరూపుడు తండ్రి హిరణ్యగర్భ స్వరూపుడు. తల్లి భూదేవి స్వరుపురాలు. అన్న ఆత్మ స్వరూపుడు. వీరు దేవతా స్వరుపూలు కాబట్టి వీళ్ళను తిరస్కరించకూడదు.
బ్రాహ్మణునికి జ్ఞానముచేత, క్షత్రియునికి వీరత్వము చేత, వైశ్యునకు ధనధాన్యముల వల్ల, శూద్రునకు వయసుచేత గొప్పతనం లభిస్తుంది. బ్రాహ్మణుడెప్పుడూ వేదాలను, ఉపనిషత్తులను అధ్యయనం చేయాలి. ఎవడు వేదాధ్యయనం చేయక యితర శాస్త్రాలను అభ్యసించునో అతడు అతని వంశస్తులు శూద్రత్వం పొందుతారు.
  బ్రాహ్మణునకు తల్లి గర్భాము నుంచి మొదటి జన్మము, ఉపనయనం రెండవ జన్మము, యజ్ఞము తృతీయ జన్మము. ఉపనయన మయ్యేదాకా శ్రాద్ధకాలమున చెప్పవలసిన మంత్రాలు తప్ప మరే ఇతర వేదమంత్రాలు చెప్పకూడదు. వేదం వలన మరోజన్మ కలిగేవరకూ (ఉపనయనం అయ్యేవరకు) బ్రాహ్మనుడూ, శూద్రునితో సమానుడే.
బ్రహ్మచారి :
→ బ్రహ్మచారి తేనెను, మాంసమును తినరాదు. కర్పూర చందన కస్తూరాది సువాసన ద్రవ్యాలను వాడరాదు. వీటిని  కలిపినా పదార్థాలను తినకూడదు. 
→ పువ్వులు ధరించరాదు. 
→ స్త్రీలతో సంభోగించరాదు. 
→ ప్రాణి హింస చేయకూడదు. 
→ పాదరక్షలు ధరించకూడదు. 
→ క్రోధాన్ని, లాభాన్ని విడిచిపెట్టాలి. 
→ పాటలు పాడకూడదు. 
→ నాట్యం చేయకూడదు. 
→ సంగీత వాయిద్యాలు వాయించరాదు. 
→ జూదం ఆడకూడదు. 
→ ఇతరులతో వృధాగా తగాదా పడకూడదు. 
→ ఇతరులను నిందించక కూడదు. 
→ అబద్ధాలు చెప్పకూడదు స్త్రీలవైపు కోర్కెతో చూడకూడదు.
→ గురువు, తల్లిదండ్రులు, అన్న వీరివల్ల బాధపడ్డా వారిని తిరస్కారింపకూడదు. 
→ ముఖ్యంగా బ్రాహ్మణులు ఈ విషయాన్ని తప్పక పాటించాలి.

ఉత్తమ తపస్సు :
 వీరు ముగ్గురికీ శుశ్రూష చేయడమే ఉత్తమ తపస్సు. వాళ్ళ అనుమతి లేకుండా మరియే ఇతర పుణ్యకార్యం చేయకూడదు. వారే ముజ్జగములు. వారే వేదములు. వారే యజ్ఞాదిఫల దాతలు కనుక త్రేతాగ్నులు. ఎవడు తల్లిదండ్రులను, గురువులను ఆదరించునో వాడు అందరిని ఆదరించువాడు. ఎవడీ ముగ్గురినీ తిరస్కరించునో అతని అన్ని క్రియలు నిష్పలము.

మరికొన్ని..
  • శ్రద్ధగలవాడు తనకన్నా తక్కువవాని నుంచైనా విద్యను గ్రహించాలి. వేరొక కులం వారినుంచైనా స్త్రీని గ్రహించాలి.
  • స్త్రీలు, రత్నాలు, విద్య, ధర్మము, ఆమోదము, సుభాషితము, నానా విధవృత్తులు శిల్పాలను ఎక్కడ నుంచి అయినా గ్రహించవచ్చు.
  • మోక్షాన్ని పొందగోరు బ్రహ్మచారి శిష్యుడు బ్రాహ్మణేతరుడయిన గురువుకు, వేదాధ్యయనం చేయని బ్రాహ్మణుడికి యావజ్జేవం శుశ్రూష చేయకూడదు. శరీరం నశించేదాకా ఎవడు గురు శుశ్రూష చేయునో అతడు తప్పక శాశ్వత బ్రహ్మలోకమును పొందుచున్నాడు.
  • వేదాధ్యయనం చేయడానికి ముందు శిష్యుడు గురువుకు ఏ విధమైన దక్షిణ ఇవ్వకూడదు. వేదాధ్యయనం ముగిసిన పిదప, వివాహం చేసుకోడానికి గురువు అనుమతి పొంది ఆ తరువాత గురువు కోరిన దానిని దక్షిణగా సమర్పించాలి.
  • ఇంద్రియాలు బలం గలవి కాబట్టి వివేకం గలవారినైనా చెడుదారి కీడువి. కాబట్టి తల్లితోగాని, సోదరితోగాని, కూతరుతోనయినా ఒంటరిగా కూర్చోకూడదు.
  • భూమి, బంగారము, ఆవులు, గుర్రాలు, గొడుగు, పాదరక్షలు, ఆసనము, ధాన్యము, కూరగాయలు, బట్టలు వీటిని దక్షిణగా ఇస్తే గురువుకు సంతోషం కలుగుతుంది.
  • బ్రహ్మణుడు శూద్రస్త్రీని వివాహం చేసుకుంటే భ్రష్టుడవుతాడని అత్రి మహర్షి, గౌతమ మహర్షి చెప్పారు. బ్రాహ్మణుడు శూద్రస్త్రీతో పుత్రుణ్ణి కంటే ఆ పిల్లవాడి తండ్రి పతితుడవుతాడని శౌనక మహాముని చెప్పాడు. బ్రాహ్మణునికి శూద్రకన్యకు పుట్టినవాడు పతితుడవుతాడని భృగుమహర్షి చెప్పారు. శూద్ర స్త్రీని శయ్యపైకి ఎక్కించుకున్న బ్రాహ్మణుడు అధోగతి పొందుతాడు. ఆ శూద్రస్త్రీతో పిల్లల్ని కంటే బ్రాహ్మణత్వాన్నే కోల్పోతాడు.
  • ఏ బ్రాహ్మణుడు తన భార్య అయిన శూద్ర స్త్రీతో హోమములు, శ్రాద్ధ కర్మలు, అతిథి పూజలు జరిపిస్తాడో వాటిని దేవతలు, పితృదేవతలు గైకొనరు. అట్టి బ్రాహ్మణునికి స్వర్గలోక ప్రాప్తి లేదు.
వివాహం ఎనిమిది రకాలు : 
   అవి-బ్రాహ్మము, దైవము, అర్షము, ప్రాజాపత్యము, అసురము, గాంధర్వము, రాక్షసము, పైశాచము. ఈ ఎనిమిదింటిలో పైశాచం అధమము, బ్రాహ్మ, దైవ, ఆర్ష, ప్రాజాపత్యములు. ఈ నాలుగు వివాహాలు బ్రాహ్మణునికి మేలయినవి. అసుర, పైశాచ వివాహములు తప్ప మిగిలినవి క్షత్రియులకు సమ్మతములు. రాక్షసము తప్ప మిగిలిన వివాహాలు వైశ్య, శూద్రులకు ధర్మ శాస్త్ర విహితమే అని తెలుసుకోవాలి.
  • వేదాధ్యయనం చేసి, సదాచార వంతుడయిన ఒక బ్రహ్మచారిని తానుగా రప్పించి, మర్యాదలు చేసి, అలంకరించిన కన్యను అతనికి ఒసగడాన్ని బ్రాహ్మణ వివాహం అంటారు. 
  • జ్యోతిష్టోమము మొదలయిన యజ్ఞాలలో ఆధ్వర్యం చేసే ఋత్విజునికి కన్యను ఇవ్వడం దైవ వివాహమంటారు.
  • యాగాది సిద్ధికోసంగాని, కన్యకు ఇవ్వడానికిగాని రెండు ఆవులనో, రెండు ఎద్దులనో వరుని నుంచి తీసుకుని శాస్త్ర ప్రకారం వరునికి కన్యను ఇవ్వడం ఆర్ష వివాహం అంటారు.
  • “మీ ఇద్దరూ కలసి ధర్మమాచరించండని చెప్పి కన్య తల్లిదండ్రులు వరుని పూజించి పిల్లనివ్వడం ప్రాజాపత్య వివాహం  అంటారు.”
  • జ్ఞాతులకు, పిల్లకు కావలిసిన ధనం ఇచ్చి తమ ఇష్టంతో పెళ్లిచేసుకోవడాన్ని అసుర వివాహమంటారు. 
  • స్త్రీ పురుషు లొకరికొకరు ఇష్టంతో అంగీకరించి కలవడాన్ని గాంధర్వమంటారు. ఈ వివాహం కామసంబంధమైనది. మైధున కర్మ కోసం ఏర్పడింది.
  • కన్యక బంధువులు సమ్మతింపనప్పుడు వారిని చంపిగాని లేదా నాశనం చేసి వాళ్ళకోసం విలపిస్తున్న కన్యను బలవంతంగా తెచ్చుకోవడం రాక్షస వివాహం అంటారు.
  • నిద్రించే ఆమెనుగాని, మత్తులోవున్న ఆమెనుగాని, ఏమరుపాటుతోనున్న ఆమెనుగాని బలాత్కారముగా, ఏకాంతముగా క్రీడించడాన్ని పైశాచికం అంటారు. ఈ వివాహం మిక్కిలి నీచమైనది.
  • జలధారాపూర్వకంగా కన్యాదానం చేయడం బ్రాహ్మణులకు ఉత్తమం. ఉదకథారా పూర్వకంగా కన్యాదానం చేయాలన్న నియమం క్షత్రియాది తక్కిన వర్ణాల వారికి లేదు. తల్లి దండ్రులు మాట ఇవ్వడం, వధూవరులకు ఇష్టం వుంటే చాలు.
  • బ్రాహ్మణ వివాహముచే పుట్టిన కుమారుడు పుణ్యం చేసినవాడు. అతడు తన ముందటి పది తరాల వారిని, తన తరువాత పది తరాల వారిని పాపాల నుంచి విముక్తం చేస్తాడు.
  • దైవ వివాహం చేసుకున్న దంపతులకు పుట్టినవాడు ముందు ఏడు తరాల వారిని,   తరువాత ఏడు తరలవారిని పాపవిముక్తులను చేస్తాడు. ఆర్ష వివాహజాతుడు ముందు వెనుకల మూడు తరాల వారిని, ప్రాజాపత్య వివాహజాతుడు “ముందు వెనుకల ఆరు తరాల వారిని ఋణ విముక్తుడిని చేస్తాడు.”
  • బ్రాహ్మము, దైవము, ఆర్షము, ప్రాజాపత్యము మొదలైన నాలుగు వివాహాల్లో జన్మించిన పుత్రులు వేదాధ్యయన సంపత్తి వలన వచ్చిన తేజస్సు కలిగినవారై, పెద్దలకు ఇష్టమైన వారుగా జన్మిస్తారు. వీరు మంచి రూపము, గుణము, బలము గలవారై, ధనవంతులై కీర్తి ప్రతిష్టలు పొందుతారు. నూరేళ్ళు జీవిస్తారు.
  • రాక్షస వివాహం వలన జన్మించిన పుత్రులు క్రూరులు, అసత్యవాదులు, వేదవిరోధులు, యాగాదికర్మ ద్వేషులై వుంటారు.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat