దేవుడు అనే వాడు ఒక్కడే ఉండాలి కదా ?? Why so many gods ? Who is God

P Madhav Kumar

 దేవుడు అనే వాడు ఒక్కడే ఉండాలి కదా ??..చాలా మంది చాలా రకాలుగా అంటారు,ఒకరు విష్ణువు దేవుడని,లేకపోతే శివుడు దేవుడు ....ఆ దేవుడు ఎవరు?


ఈ అండ పిండ భ్రహ్మండ లో దేవుడు ఒక్కడే .అది అమ్మవారు మణి ద్వీపంలో విరాజిల్లుతున్నది. మణి ద్వీపం అండ పిండ భ్రహ్మండ లో ఆఖరి లోకం.బ్రహ్మ,శివుడు, విష్ణువు ,సదా శివుడు అమ్మ వారి సింహాసనము నకు నాల్గు కోళ్ళ లాంటి వాళ్ళు.ఇలాంటి బ్రహ్మ, విష్ణువు, శివుడు లాంటి దేవతలు శత సహస్రాధిక కోట్ల మంది. భ్రహ్మాండల్లో ఒక్కో లోకానికి ఈ త్రి మూర్తులు బ్రహ్మ, విష్ణువు, శివుడు ఉంటారు. అమ్మ వారిని దర్శించుకోవాలంటే ఈ త్రిమూర్తులు అమ్మ వారి ఆజ్ఞకై వేచి చూడాల్సిందే.

ఇక ప్రతి జీవికి వారి పూర్వ జన్మ సుకృతాన్ని బట్టి ఆ ఆత్మకు ఒక్కో దేవతతో ఋణ సంబంధముంటుంది కనుక ఓ ప్రత్యేక దేవతను ఒక్కో జీవి ఆరాధిస్తుంది. ఈ విషయాన్ని సవివరంగా శ్రీ వడ్డేపర్తి పద్మాకరు గారి మణద్వీప వర్ణన అనే వీడియో యూట్యూబ్లలో చూడండీ.మరిన్ని విషయాలు తెలుస్తాయి.

రచన: H.V.S.R.C. శర్మ C.ENGR.(RTD)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat