ఏడు రకముల గురువులు - Yedu Rakamula Guruvulu, Seven Types of Gurus

P Madhav Kumar

 ఏడు రకముల గురువులు - Yedu Rakamula Guruvulu, Seven Types of Gurus

గురువు అంటే:
గురువు అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఒకటై జన్మించిన రూపం అంటే సాక్షాత్‌ పరబ్రహ్మ స్వరూపమే గురువు.
  • 🖝 గు అంటే అంధకారము లేదా అజ్ఞానాన్ని, 
  • 🖝రు అంటే నిరోధించుట లేక నశింప చేయుట అని అంటే గురువు అంటే అజ్ఞానాన్ని నశింప చే యువారు అని అర్ధము. 
గు శబ్దమంధకారస్యరుతన్నిరోధకః అని పెద్దల వచనం!గురువు చేయవలసినది తన శిష్యులను అంధకారంలోంచి వెలుగులోకి తీసుకు రావడం. ఈ భౌతిక జగత్తులో ఏ మానవుడూ సంసారయాతనలు అనుభవించకుండా చూడటం ఆ గురువు కర్తవ్యం.

ఏడు రకాల గురువులు
ఏడు రకాల గురువులు శాస్త్రాలలో చెప్పబడ్డారు.
  • 1. సూచక గురువు - చదువు చెప్పేవాడు
  • 2. వాచక గురువు - కుల, ఆశ్రమ ధర్మాలను బోధించేవాడు
  • 3. బోధక గురువు - మహామంత్రాలను ఉపదేశించేవాడు
  • 4. నిషిద్ధ గురువు - వశీకరణ, మారణ ప్రయోగాళు నేర్పేవాడు
  • 5. విహిత గురువు - విషయ భోగముల మీద విరక్తి కలిగించేవాడు
  • 6. కారణ గురువు - జీవబ్రహ్మైక్యాన్ని బోధించేవాడు
  • 7. పరమ గురువు - జీవాత్మ, పరమాత్మ ఒకటే అని ప్రత్యక్షానుభవాణ్ని కలిగించేవాడు.
గురువులు ఇచ్చే దీక్ష నాలుగు రకాలని చెబుతారు - (1) స్పర్శదీక్ష, (2) ధ్యాన దీక్ష, (3) దృగ్దీక్ష, (4) మంత్రదీక్ష.

రచన: కళ్యాణ్ 

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat