శ్రీ వేంకటేశ్వర లీలలు భాగము 10 - భార్యావియోగపు బాధతో విష్ణుమూర్తి శేషాద్రి ప్రయాణము

P Madhav Kumar


🌺 *భార్యావియోగపు బాధతో విష్ణుమూర్తి శేషాద్రి ప్రయాణము* 🌺

🍃🌹లక్ష్మీదేవి విడిచిన వైకుంఠము శ్రీ మహావిష్ణువునకు పాడుపడిన బీడువలెనున్నది. ఒక కళ లేకుండెను. దిగాలుపడి విష్ణుమూర్తి నింరతరము భార్యను గూర్చి ఆలోచించుచుండెను. 


🍃🌹పూవుల ప్రోవువంటి నా లక్ష్మి ఎచ్చటనున్నదో కదా! సుకుమార శరీర లావణ్య శోభితయగు నా రమాదేవి ఎక్కడ ఏ యిడుములబడుచున్నదో గదా? అని శ్రీమన్నారాయణుడు పదే పదే విలపించుచుండెను. 


🍃🌹ఇప్పుడాయనకు ఏ భక్తుల ఆర్తనాదములున్నూవినబడుటలేదు, ఇప్పుడాయన ఏ మునీశ్వరునికి తన దివ్యసుందర విగ్రహ దర్శన భాగ్యము కలుగజేయుటలేదు, తన తలంపులు లక్ష్మిని గూర్చి తన కన్నులు ఆమెను చూచుటకు నిరీక్షించుచుండెను. 


🍃🌹తన చెవులు ఆమె యొక్క ‘వాథా’ అను శుభకర శబ్ద శ్రవణమున కాతృత చెందుచున్నవి. లక్ష్మీదేవి వైకుంఠమున నివసించుకుండుట నారాయణునకు దుర్భరముగానుండెను. ఓదార్చువారు ఓదార్చుచునే యున్నారు. కానీ లాభము లేకుండెను. ఎప్పుడునూ విచారించని వారొక్కమారు విచారించిన అదిమేవో చాలా లోతైన బాధ అయి యుండుట సహజము గదా! దాని నాపజూపుట విఫలమగు ప్రయత్నము మాత్రమే అగును.


🍃🌹తన నిజసతిని వెదకుటకై నారాయణుడు కూడా వైకుంఠము వీడి భూలోకమును వెదకుటకై నారాయణుడు కూడా వైకుంఠము వీడి భూలోకమును వెదకుట ప్రారంభించినాడు.


🍃🌹ప్రపంచ స్థితికి కారకుడయిన శ్రీమహావిష్ణువు యొక్క ఆ స్థితికి లక్ష్మీదేవి కారకురాలయినది. మండుటెండలలో మహావర్షధారలలో ఆయన అడవులందు, కొండలందు, కోనలందు, విచార వదనముతో తిరుగసాగెను. రమాదేవికై విలపించసాగెను. 


🍃🌹రాత్రియనక, పగలనక కాలగణన మనునది లేక తన నిజసతిని గూర్చి అన్వేషణ సాగించుచునే వుండెను. మతి భ్రమించినవానివలె తిరుగుచూ వృక్షముల చెంతకు వెడలి ఓ వృక్షములారా! నా ప్రియసతి ఇటు వచ్చుట చూచినారా!’ అనీ, శిలలు వద్దకు వెడలి, ఓ శిలలారా!మీ పక్ర్కల నుండి నా లక్ష్మీదేవి వెడలుట చూచినారా?’ అని అడుగుచుండెను. 


🍃🌹ఆకలిలేదు, నిద్రలేదు. విశ్రాంతి అనునది అసలు లేనేలేదు. అన్వేషణా ప్రయాణమే పని! రమారమా అని అరచుచూ శుష్కించిన శరీరముతో శేషాద్రికి చేరినాడు.

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat