🔰 *శ్రీ గణేశ పురాణం*🔰13వ భాగం

P Madhav Kumar


 *13.భాగం* 


*ఉపాసనాఖండము*

*మొదటి భాగము*

*గజానన దర్శనం*


జన్మ మృత్యువుల కతీతుడు నిరాకారము శుధ్ధాద్వైతము అనంతము శాశ్వతుడవు అగు పూర్ణ బ్రహ్మ రూపమే నీవు పరమ నిర్గునుడవు గుణ రహితుడవు నిర్వీశేషుడవు సంకల్ప రహితమైన పరబ్రహ్మ తత్వమే నీవు త్రిగుణాతీతుడవు సృష్టికి ఆదిబోతుడవు ఐన ఓ పరమానంద రూప! జ్ఞానానంద రూపమైన గణేశ రూప నీకు నమస్కారము!


గుణాతీతుడవు పంచభూతాలకును పరమైన ఆది పురుషుడవు పరమానంద రూపియగు సర్వవ్యాప్తియగు జ్ఞానేశ్వరునకు నమస్కారము! యోగేంద్రుల చేత మునుల చేతను హృదయకాశమున ధ్యానించబడే పరమాకాశ రూపుడగు, పరబ్రహ్మయగు గణేశునకు నమస్కారము!


జగత్కారణుడవు సృష్టికి కారనుడై జ్ఞాన స్వరూపియు కాలాది చతుర్యుగ స్వరూపునకు దేవ గణములకు ఆది పురుషుడు అగు గణేశునకు నమస్కారము సమస్త విశ్వము వ్యాపించిన పరమపురుషులకు దేవతలచే నమస్కరించ తగినవాడవైన నీకు నమస్కారము!


పరతత్వరూపివియగు గణేశునకు నమస్కారము త్రిగుణ స్వరూపియగు పరమాత్ముడా రజోగుణములో బ్రహ్మస్వరూపం ధరించి సృష్టి కార్యమును నిర్వహించు సమస్త వేదాత్మకుడవు సంకల్ప స్వరూపివి సత్వగుణ రూపం ధరించి సదా క్రీడ లాగా అసురులను సంహరించే జగత్ పరిపాలకుడు అనేకావతారుడగు శ్రీమహావిష్ణు స్వరూపుడా నమస్కారము తమోగుణ ప్రధానుడు యోగిరూపివైన త్రినేత్రుడవగు ఓ రుద్రరూపి నీకు నమస్కారము!


త్రిగుణములకు అతీతమైన పరమాకాశారూపియగు తారక పరబ్రహ్మమగు ఓ సచ్చిదానంద జ్ఞాన స్వరూపుడా మా హృదయగత అజ్ఞానపు చీకట్లను పారద్రోలు సమస్త దేవ స్వరూపుడా ఓ నిర్వీకారుడా పరబ్రహ్మ రూప నమస్కారము సమస్త సృష్టికిని పుష్టినిచ్చే అమృత వర్షముతో ఓషధులను పెంచి పోషించే సోమాత్మ కూడా నీకు నమస్కారము!


సంవత్సర స్వరూపమగు కాలచక్రమునకు ఇరుసుగా ఉండి యుగాది మాస పర్యంతము కాలచక్రమును తిప్పే సూర్యనారాయణ స్వరూపుడా నమస్కారము ప్రకాశ స్వరూపియు జ్యోతి స్వరూపియు గ్రహ తారక నక్షత్ర రూపివియునైన ఓ దేవా నమస్కారము సదా విశ్వరూపి అనేక అనేక శక్తి స్వరూపం ధరించి సృష్టిగా ఏర్పడి జగదృపియగు పరమాత్ముడా నమస్కారము!


తాను సృష్టించిన జగత్తుకు అతీతుడైయుండిన ప్రణవ స్వరూపము పంచభూతములకు అతీతమైన మహాతత్వరూపి సమస్త దిక్కులు దేవతలు కాలము కర్మము మొదలైన జగత్తునకు కారణభూతుడా నమస్కారము సదా విశ్వరూపం ధరించి సృష్టి రూపంలో ప్రత్యక్షమై ప్రళయంలో సమస్తాన్ని లీనం చేసుకునే ఓ పరమాత్మ రూపి గణేశా నీకు నమస్కారము!


నీ యొక్క పాదపద్మముల యందు దృఢమైన చిత్రాన్ని కలిగినవారికి వారి పుణ్యబలం చేత ఎవరిగా అదృష్టం కలుగుతుందో అట్టి వారి సమస్త విజ్ఞములను నివారించువాడా సమస్త పీడల నుండి రక్షించే సూర్య మండల స్థితుడవైన తేజస్వరూపి నమస్కారము నీ అనుగ్రహము లేని నాడు అజ్ఞాన భ్రమ ప్రమాలకు లోను గానై వేల సంవత్సరములు నీకై వెతికిన కనిపించని మాయా స్వరూపుడా శరణాగతుడైన భక్తుని హృదయములో నీ దయతో ప్రత్యక్షమయ్య  అనుగ్రహ స్వరూపుడా ఓ ఆది పురుష సృష్టికర్త విశ్వంభరా నమో నమస్తే నమస్తే నమః పునః పునః సాష్టాంగ నమస్కారములు!


నీకు ఇవే మా స్తోత్రరూపమగు పూజనుగ్రహించి మమ్ములను అనుగ్రహించు అంటూ సమస్త దేవత గణములతో పూడి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అట్లు సాక్షాత్కరించిన పరమ సుందరమైన ఆ గణేశ రూపాన్ని ప్రార్థించారు ఆ వృత్తాంతాన్ని బ్రహ్మ ఇలా వివరించాడు.


ఓ వ్యాసమునేంద్ర గజాననుడు పై స్తుతికి సంతుష్టుడై కృపా వీక్షణాలతో వారిని చూస్తూ ఇలా అన్నాడు ఓ త్రిమూర్తులారా మీకు వచ్చిన కష్టం ఎలాంటిది మీరు ఇక్కడకు రావడానికి గల కారణమేమిటి ఏమి కారణమైనప్పటికీ మీరు ఈ స్తుతికి ఎంతో సంతోషించినాను మీరు కావలసిన వరాలను కోరుకోండి మీ చేత చేయబడిన ఈ భక్తి పూర్వకమైన స్తుతి స్తోత్రాలలోకెల్లా తలమానికమై లోకంలో అంతులేని ఖ్యాతి వహించగలరు.


ప్రాత కాలమున లేచి త్రిసంధ్యాలలోనూ ఎవరైతే దీనిని శ్రద్ధాలురై పటిస్తారో వారి ఇహలోక సౌఖ్యాలను సర్వాభిష్ఠములను పొందుతారు అంత్య కాలములో పరబ్రహ్మస్వరూపులు అవుతారు అన్న గజాననుని వాక్యములు విని త్రిమూర్తులు సంతుష్టాంతరంగులై ఇలా ప్రార్ధించారు.


ఓ దేవా దేవా నీవు మా స్తోత్రమునకు సంతుష్టుడవైతే మాకు నీ చరణాల ఎడ విస్మృతి లేని, అనన్య భక్తిని ప్రసాదించు అంతేగాక మేము చేయవలసిన కర్తవ్యాన్ని ఆజ్ఞాపించు ఇది మా కోరిక త్రిమూర్తుల మాటలను విన్నా గణేష్వరుడు ప్రసన్నుడై ఓ త్రిమూర్తులారా మీ కోరిక ప్రకారమే నాయందు మీకు దృఢభక్తిని ప్రసాదిస్తున్నాను.


 *సశేషం........*

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat