🎻🌹🙏 బసవ పురాణం..17 వ భాగము....!!

P Madhav Kumar


🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿


🌸అవివేకుడనైన నాలో వివేకం ఎందుకుంటుంది?ఈ విధంగా బసవన్న తన్ను తాను చిన్న జేసుకొని మారయ్యను పొగిడాడు.


🌿మారయ్యా బసవయ్యా ఈ విధంగా భక్తి వారాశిలో మునిగితేలారు

కన్నడ బహ్మయ్య కథ కల్యాణం లోనే కన్నద బ్రహ్మయ్య అనే గజదొంగ ఒకడున్నాడు. 


🌸అతడు మహాశివభక్తుడు. రాత్రిళ్లు ఇళ్లకు కన్నాలు వేసి లోపలికి వెళ్లేవాడు. ఆ ఇల్లు శివ భక్తులదయితే వారి పాదాలకు శరణం జేసి ‘నేను కన్నద బ్రహ్మయ్యను. 


🌿తెలియక మీ ఇంటికి దొంగతనానికి వచ్చాను. క్షమించండి అని ప్రార్థించి దొంగలొస్తారేమో జాగ్రత్తగా ఉండండి’ అని మరీ హెచ్చరించి వెళ్ళేవాడు. 


🌸తాను వెళ్లిన ఇల్లు పిసినిగొట్టు మనుషులది కనుక అయినట్లయితే ఆ ధనాన్నంతా సంగ్రసించి మరునాడు దానితో జంగమార్చనలు చేసి సంతృప్తి చెందేవాడు.


🌿ఇలా ఉండగా ఒకనాడు కన్నద బ్రహ్మయ్య ఇంటికి అసంఖ్యాకులైన జంగమయ్యలు వచ్చారు. వారందరినీ అర్చించాలంటే మామూలు ధనం సరిపోదు. 


🌸వారూ వీరూ ఎందుకు? బిజ్జలుని ధనాగారమే కొల్లగొడుతాను అనుకున్నాడుబ్రహ్మయ్య.బ్రహ్మయ్య కత్తి, గునపము చేత బట్టి వెళ్తుంటే వీధిలో బసవేశ్వరుడు ఎదురుపడ్డాడు. ‘


🌿బసవన్నా, నేను బిజ్జలుని ధనాగారం కొల్లగొట్టాలని వెళ్తున్నాను. దయతో దారిచూపు’ అని అర్థించాడు బ్రహ్మయ్య. 


🌸భక్తులడిగితే లేదనేది లేని వ్రతంకల బసవన్న ‘సరే! పద’మని బ్రహ్మయ్యను వెంటబెట్టుకొని వెళ్లి బిజ్జలుని ధనాగారం చూపాడు. బ్రహ్మయ్య ధనాగారాన్ని కొల్లగొట్టి తీసుకొని వెళ్లిపోయాడు.


🌿రక్షకులకీ విషయం తెలిసి రాజుకు చెప్పారు.బిజ్జలుడదివినిమండిపడ్డాడు.శివభక్తుడని విశ్వసించి బసవడికి ఈ పదవి ఇస్తే చివరకు నా ధనాగారానికే ఎసరు పెడతాడా? 


🌸అని క్రోధంతో ధనాగారం వద్దకు పరుగెత్తుకొనిపోయాడు.బిజ్జలుడు వచ్చి ధనాగారానికి కన్నద బ్రహ్మయ్య తవ్విన కన్నం చూచేసరికి ఆ కన్నం తీసిన మట్టికుప్ప మొత్తం బంగారమై కన్పడింది. 


🌿అది చూచి బిజ్జలుడు దిగ్భ్రాంతుడైనాడు. అప్పుడు బసవన్న బిజ్జలునితో ఇలా అన్నాడు.రాజా! కన్నద బ్రహ్మయ్య సామాన్యుడు కాడు. 


🌸అణిమాద్యష్టసిద్దులు కలిగిన మహాయోగి. అయితే దొంగతనం వృత్తిగా స్వీకరించాడు. ఆ విధమైన కాయకాన సంపాదించిన దానినే గ్రహిస్తాడు కనుక నీ భాండాగారానికి కన్నం పెట్టాడు.


🌿అయితే దొంగతనం తప్పు కాదా అని నీవు నన్నడగవచ్చు ప్రభూ! కాని తప్పు దొంగతనంలో లేదు. దానిప్రయోజనంలో వుంది. జూదమాడి పాండవులు భ్రష్టులైనారు. 


🌸కాని జూదమాడి ఒక భక్తడు శివుణ్ణి చేరాడు. వేటాడి రాముడు భార్యను పొగొట్టుకున్నాడు. వేటాడి తిన్నడు శివసాయుజ్యం పొందాడు. 


🌿పరసతి నాసించి రాజులు నశిస్తే పరసతివల్ల మోక్షం పొందాడు నంది. మాండవ్యుడు హత్య చేసి కొరత వేయబడ్డాడు. కాని చండుడు హత్య చేసి శివానుగ్రహం పొందాడు. 


🌸అబద్ధం చెప్పి బ్రహ్మ తల పొగొట్టుకున్నాడు. కాని అబద్ధం చెప్పి చిరుతొండడు కైలాసం పోయాడు. గొర్రెను దొంగిలించి శూద్రకుడు నరకం పొందితే అదే పనివల్ల శివభక్తుడు సాయుజ్యం పొందాడు. 


🌿రాజ్యాంతే నరక’మని అంటారు కాని చౌరవ, చోడుడు శివభక్తులై పాలించి కైలాసం చేరారు. కాబట్టి ఏది తప్పు ఏది ఒప్పు అని నిర్ణయించవలసింది దాని ప్రయోజనాన్ని బట్టి మాత్రమే! 


🌸అధర్మో ధర్మతాం వ్రజేత్ అనే శివవాక్యం నీవు వినలేదా?

ఇక కన్నద బ్రహ్మయ్య సంగతి చెపుతాను. శివపూజ కొరకు మాత్రమే అతడు దొంగతనం చేస్తాడు.


🌿అప్పుడు పగలూ రాత్రీ అని చూడడు. అందునా భక్తుల ఇళ్ళ జోలికి పోడు. లుబ్ధులైనవారి ధనాన్ని తీసుకొనిపోయి భక్తులకిస్తాడు. 


🌸ఈ విధంగా ఆ పిసినిగొట్టువారిని కన్నద బ్రహ్మయ్య అనుగ్రహిస్తున్నాడని అర్థం!ఇప్పుడు నీ ధనాగారాన్ని బ్రహ్మయ్య ఈవిధంగాఅనుగ్రహించాడు. 

బిజ్జలా! డబ్బు పోయిందనిదుఃఖించకు. 


🌿నీ ధనమంతా నీ భాండారంలోనే వుంది చూడు’’ అని లెక్కల పుస్తకం తీసి చూపించి దాని ప్రకారం లోపల సొమ్మంతాఎక్కడిదక్కడ ఎట్లా యథాస్థానంలోనే వుందో చూపించాడు బసవన్న. బిజ్జలుడు నివ్వెరపోయాడు. 


🌸బసవన్న చిరునవ్వు నవ్వాడు.

అక్కడ కన్నద బ్రహ్మయ్య తాను కాయకంతో తీసుకొనిపోయిన ధనంతో జంగమార్చన చేసి శివానుభవం పొందాడు.


🌿6కల్యాణ నగరంలో శివనాగుమయ్య అనే మహాభక్తుడు ఉండేవాడు. అతడు కులం చేత అంత్యజుడు. గుణం చేత అగ్రజుడు. ఆయనను బసవేశ్వరుడు నిత్యం అర్చించేవాడు. 


🌸అది చూచి అగ్రకులానికి చెందినవారు రాజు వద్దకుపోయి ఇలా చెప్పారు.ప్రభూ మన బసవయ్య మాల మాదిగలను భక్తులు భక్తులంటూ పొగుడుతున్నాడు...

సశేషం...🚩🌞🙏🌹🎻


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat