🍃🌹ఒకనాడు శౌనకాది మునిపుంగవులు సూతుల వారిని సకల ఇష్టార్థ సిద్ధి ప్రదంబగు పుణ్యస్థలం బేదియయి యున్నది? శ్రీమన్నారాయణుడు భూలోకమునకు మానవుల పూజల బొందుటకు భూతలమునకు విచ్చేయుట, దానికి సంబంధించిన కథలను మాకు చెప్పవలసినది అని ప్రార్ధించిరి.
🍃🌹అంతట సూతులవారు – మునులారా! భూలోకము మొత్తము మీద శ్రీవేంకటాచలము శ్రేష్ఠతరమయిన పుణ్యస్థలము, అందు శ్రీమహావిష్ణువు వేంకటేశ్వరుడై కలియుగమున దైవమై భక్తుల కోరికలీడేర్చుచుండును.
🍃🌹తను భక్తుల కోరికలను తీర్చుటయందు శ్రీవేంకటేశ్వరుని ముందు సర్వదైవములున్నూ తీసికట్టుగానేయుందురు.
🍃🌹అనగా విని శౌనకాదులు సౌత! ఆర్షవిజ్ఞాన పునీతా! ఆర్ష విజ్ఞాన పునీతా!ఆ మహావిష్ణువు శ్రీ వేంకటేశ్వరుడైన విధము, ఆ శ్రీ వేంకటేశ్వరునికి చెందిన అనేకానేక లీలలను, మాకు తెలియజెప్పి, పుణ్యము కట్టుకొనుమనీ, తమ్ము మహానంద భరితులుగా నొనర్చవలసినదనిన్నీ కోరిరి.
🍃🌹అంతట సూతులవారు మునీశ్వరులారా! నేను ఆ మహిమాన్వితుని వేంకటేశ్వరుని లీలలు చెప్పుట కెంతటివాడను, కాని మీరు ఆసక్తితో భక్తి శ్రద్ధలతో వినకోరెదరని నేను భావించి శ్రీ వేంకటేశ్వరునకు చెందిన ఏవియో కొన్ని లీలలను చెప్పగలవాడను అని తన సహజ వినయమును ప్రకటించుకొని హృదయము గురువైన వేదవ్యాసుని తలపోసెను.
🍃🌹అట్లు వేదవ్యాసుని తలచుకొనుట వలన సూతులవారికి తాను శౌనకాదులకు చెప్పబోవు కథా విశేషములు అన్నియు కళ్ళకు కట్టినట్లు అవగతమయ్యెను.
🍃🌹అనంతరము శౌనకాది మహర్షులతో ఇట్లు చెప్పసాగినారు.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏