⚜️ ప్రత్యేక ఆరాధనలు.,అప్పము ⚜️
అప్పముతో ఆరాధించుట అనునది స్వామివారికి మిక్కిలి ఇష్టమైన ఆరాధన , స్వచ్ఛమైన నెయ్యి అప్పమును చూడవలెనన్ననూ , నెయ్యి అప్పము యొక్క రుచిని చూడ వలయున్ననూ శబరిగిరి యందు తయారగు నెయ్యి అప్పమునే తినవలెను. గుంతలుండెడి పళ్ళెరములలో పిండికి సరిపడునంత నెయ్యని పోసి అచ్చముగా నెయ్యితోనే పిండిని పక్వము చేయడమువలన ఆ అప్పమునకు అంత రుచి వచ్చును. అప్పము ఆరాధన జరుపవలయుననుకొనెడి వారు ముందుగానే దేవస్వం వారికి (చెల్లించవలసినంత) పైకము చెల్లించి రసీదు పొంది దానిని భద్రపరచుకొనవలెను. అచ్చట (అప్పము తయారు చేయు స్థలమునందు) బియ్యపు పిండిని బెల్లము పాకములో కలిపి అప్పములు తయారుచేసి కుప్పపోసి యుంచుదురు. అన్ని అప్పములు చూసి ఆశ్చర్యము చెందని వారుండరు.
🙏🌺ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప🌹🙏