⚜️ వెడివయిప్పాడు ⚜️
స్వామివారి యొక్క సన్నిధి ముంగిట ఈ టపాకాయలు ప్రేల్చు స్థలము ప్రత్యేకముగా కానవచ్చును. అచ్చటకు పోయి మనకు కావలసినన్ని టపాకాయలను ముందుగానే పైకము చెల్లించి రసీదును పొందవలెను. కొంచెము దూరమున అవి ప్రేల్చుటకు శబరిమల వనయాత్ర మనుష్యులు నిలబడి యుందురు వారి వద్ద టిక్కెట్లను ఇచ్చినచో వారు వెంటనే మన టిక్కెట్ల ప్రకారము చిన్నవి , పెద్దవి , ప్రేలేవి , కాలేవి మొదలగు రక రకములైన టపాకాయలను ప్రేలి
మ్రోగించెదరు. శతము లెక్కన టపాకాయలు ప్రేల్పించి స్వామి అయ్యప్పను మెప్పించే భక్తులు అనేకులు ఉన్నారు. శబరిగిరి వెడలు వారిలో అధిక భాగము అయ్యప్ప భక్తులు ఒక టపాకాయయైననూ ప్రేల్పించక సన్నిధానము నుండి మరలరు. ఈ టపాకాయలు ప్రేల్చుట అనునది స్వామికి ఇష్టమే కాక భక్తులకు కూడా అనేక లాభములు కలుగును.
శబరీ వనయాత్ర మొదలు సన్నిధానము వరకు ఈ టపాకాయలు ప్రేల్చే ఆరాధనకు మిక్కిలి ప్రాధాన్యత నొసంగి యున్నారు. ఘోరాడవిలో సంచరించు వన్యమృగములు ఈ శబ్దములకు భయపడి దూరముగా పోవుటకునూ , గుంపులు గుంపులుగా యాత్ర చేయు భక్తాదులు శబరిగిరి సన్నిధానపు దారిని తెలుసుకొనుట కొరకునూ , దారి పొడుగునా దేవస్వం వారు తావళమేర్పర్చుకొని ఈ టపాకాయలను ప్రేర్చే ఆరాధనను చేయించుచున్నారు. కావున భక్తాదులు వారి వారి శక్త్యానుసారము టపాకాయలు ప్రేల్పించి స్వామివారిని ఆనంద పరచవలెను. భక్తుల సౌకర్యము , రక్షణే , ఆ భక్తవత్సలునికి ఆనందమే.
🙏💐ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప🌸🙏