🌻 *బ్రహ్మలోకమున భృగువు* 🌻
🍃🌹అది సత్యలోకము, అది మహాసభ, అందు చతుర్ముఖుడగు బ్రహ్మ, ఆయన ధర్మపత్నియగు సరస్వతీదేవి సభలోనున్న ఉన్నతాసనములందున్న వారయి వెలుగొందుచుండిరి.
🍃🌹మిరుమిట్లు గొలిపే ఆ సభలో ఒకవైపున రాజర్షులు, బ్రహ్మర్షులు, దేవర్షులు, మున్నగువారుండిరి, మరియొక వైపు దేవతలు, యక్షులు, గరుడులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు ఆసీనులయియున్నారు.
🍃🌹వారికందరకు సృష్టి విజ్ఞాన సంపన్నుడయిన బ్రహ్మ వేదములందలి అంతర్భూతములయిన రహస్యముల నెన్నింటినో బోధించుచుండెను. ఆ సమయమునకు భృగమహర్షి అచ్చటకు వచ్చెను. చరచరా సభను ప్రవేశించినాడు.
🍃🌹సభాసదుల నొక్కసారిగా కలయజూచెను. బ్రహ్మకాని మరెవ్వరుకానితనను కూర్చును’డని అడుగకయే తనంతట తానుగా నా సభలో గల నొక ఆసనము పై గర్వముగా కూర్చునినాడు.
🍃🌹సభాసదులకు భృగుమహాఋషి వచ్చుట వలన కలిగిన ఆనందముకన్న ఆయన ఆ విధముగా కూర్చోనుట వలన కలిగిన ఆశ్చర్యమే ఎక్కువగానుండెను.
🍃🌹బ్రహ్మకు భృగుమహర్షి ప్రవర్తన అవమానకరము, సభాసంప్రదాయములను పాటించి పెద్దవాడయిన తనకు నమస్కరించకమునుపై భృగువు ఆసీనుడగుట కోపము వచ్చి యిట్లనెను.
🍃🌹భృగూ! ఏమిటి నీ ఈ వింత ప్రవర్తన, నీ ఇచ్చవచ్చినట్టున్నూ, నీకు నచ్చినట్లున్నూ సభలో ప్రవర్తించుట అమర్యాదకరము కదా! ఈ సభలో మునిగణము కన్న మిన్నయని నీవు నీవు భావించుచుంటివా! వీరిలో నీవ వెవరకన్న గొప్పవాడవు? త్రిమూర్తులను సైతము పసిపాపలుగా మార్చివేసిన ఆ యత్రిమహామునికంటే అధికుడవా?
🍃🌹ఇంద్రునే శపించిన ఈ గౌతమమహర్షి కంటె గొప్పవాడవా? చూడు, నివురుగప్పిన నిప్పువలె ఆ యాసనము పై జమదగ్ని ఎట్లు వినయముగా కూర్చొనియున్నాడో? శక్తిసంపన్నుడైన ఆ జమదగ్ని కన్న నీవు ఊడబొడిచినదేమున్నది? సభాకార్యములందెట్లు మెలగవలెనో తెలియని తెలివితక్కువ వాడవని నిన్ను నేనిదివరకొనుకొనలేదు’’ అని బ్రహ్మ పెట్టవలసిన నాలుగు చివాట్లూ పెట్టినాడు.
🍃🌹భృగువు ఇదంతయు విని, ఈ బ్రహ్మ నేను నమస్కారము చేయనంత మాత్రముననే దూషించుచున్నాడు కదా! సత్త్వగుణ సంపన్నునకు దూషణ భూషణ తిరస్కారములు సమముగనే కనిపించునుగదా! నమస్కారము చేయనంత మాత్రమునకే వుగ్రుడైన బ్రహ్మ.
🍃🌹సత్త్వగుణ ప్రధానుడు కాడని నిర్ణయించుకొని బ్రహ్మకు తిరిగి జవాబు చెప్పకుండగనే సభను వీడి వెడలిపోయెను. సభాసదులు మరింతగ ఆశ్చర్యపడిరి.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏