⚜️ ఉదయాస్తమన పూజ ⚜️
ఇది శబరిమల సన్నిధానము తెరచియుండే అన్ని మాస పూజల వేళలో జరిపించవచ్చును. మండల మకర రద్దీ నిండిన వేళలో ఈ పూజలు దేవస్థానము వారే చేస్తారు. భక్తులకు ప్రవేశముండదు. శబరిమల స్వామివారికి ఉదయము సన్నిధి తెరచినప్పటినుండి రాత్రి హరివరాసనము వరకు 18 పూజలు నిర్వహిస్తారు. దానినే ఉదయాస్తమన పూజ అని అందురు. ఇందుల కొరకు దేవస్థానము వారికి రూ.20,001/- చెల్లిస్తే ఐదుగురు భక్తులు సన్నిధి ముంగిట హుండీవద్ద నిలబడి ఈ 18 పూజలను తిలకించవచ్చును. ఆయా పూజ ముగియగానే తొలి ప్రసాద ఆకును అది చేయించిన గ్రహస్తులకు ఇస్తారు. కాని ఈ 18 పూజలను భక్తులు చూడలేక పోయినను ఆయా పూజలు జరిగేటప్పుడు లైన్ లో వచ్చే భక్తులు తిలకించి తరించవచ్చును.
🙏🌻ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప🌻🙏