🔱 శబరిమల వనయాత్ర - 73 ⚜️ శబరిగిరి కోవెలలో పూజలు ⚜️

P Madhav Kumar

⚜️ శబరిగిరి కోవెలలో పూజలు ⚜️

ప్రతి ఒక్క మలయాళ మాసము మొదటి 5 రోజులు వరకు మాత్రమే శబరిగిరి ఆలయమునందు పూజలు జరుపబడుచున్నవి. మిగిలిన దినములలో కోవెల మూసి యుండును. తగిన ఆయుధములు ధరించిన రక్షకభటులు వెంబడించి రాగా టపాకాయలను ప్రేల్చుచూ కొంతమంది వెంటరాగా *'వనకట్టు'* మంత్రమును ఉచ్ఛరించు కొనుచూ ఆ ఘోరాడవి మధ్య నుండి ఆలయ పూజారులైన *'మేల్ శాంతి'* మరియూ *'పోట్రిమారే'* వీరు వెళ్ళి స్వామికి పూజలు ఆరాధనలూ చేయుదురు. ఎంతటి ఘోర వన మృగములు సంచారము చేయు చుండిననూ , ఇప్పటివరకూ కరుణాసాగరుడైన ఆ అయ్యప్పస్వామి కృపచే ఎవ్వరికినీ ఏ ఆపదా కలగలేదు. దుష్టజంతువులు మానవుల దృష్టిలో పడిననూ అవి ఎవరికీ ఏ హానీ చేయక తమ దారిన తాము పోవుచున్నవి అన్నది  ఆ స్వామి కటాక్షము కాక వేరు అగునా ? సాధారణ అయ్యప్ప భక్తులు ఈ *'మేల్ శాంతి* పూజారులతో పాటు సమముగా నడువజాలరన్న అతిశయోక్తి ఏమియూ లేదు. ఉరుకులు పెడుతూ వారు కొండ ఎక్కుచుందురు. ఎంతటి వేగముగా నడుచు వారైనా వారితో సమానముగా పోజాలరు. అదియూ స్వామి మహిమేనేమో ! ఇప్పుడిప్పుడు పూజా దినములలో మార్పులు చేయుచున్నారు. అవి ఆయాకాలములలో పత్రికలలో ప్రకటింప

చేయుదురు. అంతేకాదు. తిరువాన కురు దేవస్వం బోర్డువారు అయ్యప్ప సేవా సమాజములను ఏర్పరచి ప్రపంచమంతట యుండు అయ్యప్ప భక్తులకు కావలసిన సహాయములు చేయుటకు (స్వామి విషయమున) సిద్ధముగా యుంచినారు.


🙏🌻ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప🌻🙏

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat