⚜️ విషు దర్శనము ⚜️
చైత్ర మాసము 1 వ దినమున విషు పుణ్యకాలము నందు అయ్యప్ప భక్తులు శబరిగిరిపై కూడుదురు. సంవత్సరము మొదటి దినము అయ్యప్పస్వామిని *'కణి'* చూచి , ఆ సంవత్సరమంతా మొదటి దినము వలె శుభకార్యములు జరుగును అను విశ్వాసముతో అభిలాషతో *'విషుక్కణి'* చూచుటకు యాత్ర చేయుదురు. మకర దర్శనమునకు వెడలినట్లే దీనికి గూడా మాల ధరించి , మండల వ్రతముండి ఇరుముడి మోసుకొనియే శబరిగిరికి వెడలవలెను. అయిననూ మకర సంక్రాంతి దినమున
వచ్చినంత సంఖ్యలో భక్తులు రారు గనుక , అంతటి ఒత్తిడి విషు దర్శనమునకు ఉండదు
గనుక శబరిగిరీశుని సావధానముగా చూచి ఆనందించవచ్చును.
🙏🥀ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప🥀🙏