*8.భాగం*
రాజా !ఆపాపరాక్షసుని తమ్ముడు కర్కశుడను పేరుగలవాడు నాతో యుద్ధముచేయజాలక
కపటోపాయము నవలంబించి మాయింట వంటలవాడై యుండెను. నాకాసంగతి
యిసుమంతయు దెలియదాయెను. ఇట్లుండగా నొకనాడు దుర్వాసాముని
భోజనార్థియయి మండుచుండునగ్నివలె మాయింటికి దయచేసెను. పాపాత్ముడగు నారాక్షసుడు మనుష్యమాంసమును వడ్డించెను. కేశసంకీర్ణమయిన మనుష్య మాంసమును జూచి యాయన్నమువిడిచి కోపపరీతాత్ముడై యాముని “దురాత్ముడనగు రాజాధమా ! నాకుమనుష్యమాంసమునటరా వడ్డింపజేసితివి ?” అని
నేనెంతగా బ్రతిమాలు కొనుచున్నను నామాట వినిపించుకోక “పాపాత్మ ! నాకు యిట్లు దేవలుడు చెప్పుచుండగా రాక్షసుడు కోపముగలవాడై యొక పెద్దరాయితీసి
“చావుము" అని రాజుమీదను విసరెను. ఆవచ్చుచున్నశిలను వజ్రమువంటి బాణముల చేతను బొడిగావించి యారాక్షసుని సర్వాంగములయందును
బాణములను నిండించెను. తరువాతను రాక్షసుడు కోపపూరితుడయి “ఓరీ !
మూడుడా !కాలచోదితుడనయి నాకంటబడితివి. ఇక నెక్కడకుబోయెదవు ? ఇపుడు
నిన్ను వజ్ర సదృశమయిన నా పిడికిలితో బొడిచి చంపి నీరక్తముద్రావి తృప్తిని బొందెదను" అని చెప్పి మీదికి బిడికిలిపట్టి పరుగెత్తుకొని వచ్చుచున్న రాక్షసునిపై
నొక్కవాడిబాణమును బ్రయోగించి యాచేయి ఖండించెను. మఱియొక బాణము చేతను రెండవచేయిగూడ ఖండించెను. ఇట్లు రెండుచేతులును దెగిపడిపోవుటచే
బలవంతుడగు రాక్షసుడు నోరు తెఱచికొని కోఱలతో వానిని బీడింతునుగాక యని
వచ్చుచుండగా నంతట దేవలు డర్ధచంద్రాకారముగల బాణము ప్రయోగించి
రాక్షసుని శిరస్సు తెగగొట్టెను. వాని శిరస్సు వజ్రాయుధముచే గొట్టబడిన కొండశిఖరమువలె నేలగూలినది. తరువాతను విమానమెక్కి దివ్యరూపధరుడగు
నొకానొకపురుషుడు తన తేజస్సుచే దశదిశలను వెలిగించుచు దేవలునికగపడెను.
అతనినిజూచి యాశ్చర్యపడి నీవెవరు ? అని దేవలు డడిగెను. ఇట్లడుగగా
నతడిట్లనియె రాజేంద్రా ! సాధు ! సాధు ! పవిత్రుడినయితిని.నీధర్మమున
దుస్తరమయిన శాపసముద్రమును దాటితిని. నాశాపాగ్ని హోత్రమును జల్లార్పితివి.
నావృత్తాంతమంతయు జెప్పెద నాలింపుము. నేనిక్ష్వాకుపుత్రుడగు విశాలుని
కుమారుడను. నేను మహబలపరాక్రమములు గలవాడను. నాపే రగ్రధన్వ
యందురు. నేను బాగుగా రాజ్యమేలితిని. నాపట్టణము విశాలయను పేరుగలది.
నేను రాజ్య మేలు కాలముందు వికటు డను పేరు గల రాక్షసుడు దేశములను
బాధించుచు మునీంద్రులను భక్షించుచున్నవాడు. నేనాసంగతిదెలిసికొని
యాపాపాత్మునిజంపి యందఱకును సంతోషమును గలిగించితిని. రాజా !
ఆపాపరాక్షసునితమ్ముడు కర్కశుడను పేరుగలవాడు నాతో యుద్ధముచేయజాలక
కపటోపాయము నవలంబించి మాయింట వంటలవాడై యుండెను. నాకాసంగతి
యిసుమంతయు దెలియదాయెను. ఇట్లుండగా నొకనాడు దుర్వాసాముని
భోజనార్థియయి మండుచుండునగ్నివలె మాయింటికి దయచేసెను. పాపాత్ముడగునారాక్షసుడు మనుష్యమాంసమును వడ్డించెను. కేశసంకీర్ణమయిన మనుష్య మాంసమును జూచి యాయన్నమువిడిచి కోపపరీతాత్ముడై యాముని “దురాత్ముడనగు రాజాధమా ! నాకుమనుష్యమాంసమునటరా వడ్డింపజేసితివి ?” అని
నేనెంతగాబ్రతిమాలుకొనుచున్నను నామాట వినిపించుకోక “పాపాత్మ ! నాకు మనుష్య మాంసమును బెట్టించినందులకు ఫలముగా దురాచారుడవై మనుష్యమాం
సము దినుచుండుము. అని నిర్దోషుడనని మొఱ పెట్టుచున్నను నన్ను శపించెను.ఆశాపమువిని మిక్కిలిని బరితపించిన వాడనయి భయపడి "మునిచంద్రా !నాయందు దయదలంచుము. నాశాపమున కంతమును గల్పించుము." అని
యనేకవిధములుగా బ్రార్థింపగా నపుడతడు “శివునిమానసపుత్రుడగు దేవాంగుడనునతడు సమస్తమైన వారికిని మానసంరక్షకుండు ముందు పుట్టగలడు.అతడువచ్చి శాపమును డొలగించును. అంతవఱకును నీవు రాక్షసుడవై యుండుము" అని చెప్పి యాముని యంతర్ధానమాయెను. వెంటనే నేను రాక్షసుండనయిపోతిని. చిరకాలమునుండి శాపదగ్గుడినయి యీయడవిలో
బడియుంటిని. నేను భక్షించిన జంతుజాలములకు లెక్కయేలేదు. రాజేంద్రా !
యిన్నాళ్ళకు నీవలన సమస్త పాపములు పోయి పవిత్రుడనయితిని. ప్రభూ !
నావృత్తాంతమంతయు నీ యడిగినయట్లు చెప్పితిని. నేను నీయొద్ద ననుజ్ఞాతుడనయి
పోయెదను. నీకెప్పుడును క్షేమ మగుకాక.బ్రహ్మ నారదా ! అత డిట్లు చెప్పి పరమ సంతోషమును బొంది
దేవలోకమునకు బోయెను. మహాశూరుడగు దేవలుడు వామదేవమహాముని
సన్నిధికి వచ్చెను. ఆమునిచే విశేషముగా సత్కరింపబడి యతనియొద్ద
సెలవుపుచ్చుకొని యచ్చటనుండి క్రమముగా మేరు పర్వతమునకు బోయెను.
*సశేషం.......*