దానం చేస్తున్న కొద్దీ పెరుగుతుంటుంది

P Madhav Kumar


🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


 𝕝𝕝 *శ్లోకం* 𝕝𝕝 


ప్రాప్తవ్యమర్థం లభతేమనుష్యో

దేవో పి తం వారయితుం న శక్తః |

అతో న శోచామి న విస్మయో మే

యదస్మదీయం నతు తత్పరేషాం ॥


(ఆచార... 113/32)


సర్పము, ఎలుక, ఏనుగు పారిపోవలసి వస్తే ఎక్కడిదాకా పోగలవు? పుట్ట, కన్నం, అడవి... అంతదాకానే కదా! 


*అలాగే మన ఐశ్వర్యం కూడా మన పూర్వజన్మ సుకృతం అయిపోయేదాకానే వుంటుంది. మనం కర్మను దాటిపోలేము*.


నూతి నుండి నీరు తోడుతున్న కొద్దీ ఊరుతుంటుంది. సద్విద్య ఎవరికైనా ఇస్తున్న కొద్దీ పెరుగుతుంటుంది.


 *ధర్మమార్గంలో సంపాదించిన ధనమేధనం...అది దానం చేస్తున్న కొద్దీ పెరుగుతుంటుంది*. 


*అధర్మాచరణ ద్వారా ఆర్జింపబడిన ఐశ్వర్యం తాను మిగలదు గానీ ఆ మనిషికి పాపాన్ని మాత్రం మిగిల్చిపోతుంది*

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat