అరుణాచలం లో భూతనారాయణ గుడి*

P Madhav Kumar

 అరుణాచలం లో ప్రధాన అరుణాచలేశ్వరుడి గుడికి అతి చేరువలో ఉత్తర  గోపురం  

వైపు ఉంటుంది.

 . ఈ గుడి శ్రీ కృష్ణుడే భూతనారాయణుడిలా కొలువై ఉన్నాడు ఎక్కవగా చాలామందికి తెలియదు.


       కృష్ణుడు బాలుడిగా ఉన్నప్పుడు కంసుడు 

,"పూ తన" (బూతన  అనికూడా అంటారు)అనే రాక్షసిని పంపుతాడు ఇది అందరికీ  తెలిసిందే అలా వచ్చిన పూతనను స్వామి సంహరిస్తాడు...


.రాక్షసి  కృష్ణుడికి చనుపాలు ఇచ్చి వాటిద్వారా విషాన్ని పంపి హానిచేయాలని చూస్తుంది రాక్షసి పాలు తాగినందుకు స్వామి లీలగా బూత ఆకారం పెద్ధగా ఉండే రూపమే మనం ఈగుడిలో చూడవచ్చు...


 .అరుణాచలం లో కొన్ని సంవత్సరాలు ఈగుడి కనుమరుగైయింది ....


తరువాత స్వామి ఒక భక్తుడి కలలో కనబడి ఈ ప్రదేశంలో ఇసకలో ఉన్నాను పైకి తీసి గుడి కట్టమని ఆదేసించాడు.


       భక్తులు మంచి సంతానం కోసం స్వామిని వేడుకుంటారు..


వెన్న,మిటాయిలు స్వామి కీ సమర్పిస్తారు...


మరో విషేశం గిరి ప్రదక్షిణ లో చివరగా మనం దర్శించేది.


 ఇదే ఒకరకంగా చెప్పాలంటే మనం శివునికి పూజలు చేస్తే విష్ణువు సాక్షిగా ఉంటాడు....


 అలాగే విష్ణువుకు చేసిన పూజకు శివుడు సాక్షిగా ఉంటాడు వేరే సందేహమేలేదు .


స్థానికంగా బూతనారాయణ పెరుమాళ్ కోయిల్ అంటారు.


   జై బూతనారాయణ స్వామి 🌹🙏🚩


        అరుణాచల శివ🌹

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat