భారతమాత మందిరం హరిద్వార్ ...!

P Madhav Kumar

ఉత్తరాంచల్ పర్వత పాదము నందలి హరిద్వార్ పట్టణమున భారతదేశంలో ఏకైక విశిష్ఠ దేశమాత మందిరంగా విరాజిల్లుతుంది.ఇది 180 అడుగులఎత్తున నున్న 8 అంతస్తుల విశేషమైన మందిరము .ఇది 1983వసంవత్సరమున నిర్మించబడి అప్పటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీచే ప్రారంభింపబడినది . ఇందు మొదటి అంతస్తున విశాల భారతదేశ పటమును భారతమాత విగ్రహము కలవు .ఇందు భారతమాత నాలుగు చేతులలో వరికంకులు వస్త్రము అక్షమాల పతాకము పట్టి, మూడు జండారంగుల చీరకట్టి పాదములవద్ద తామరలతో   జనులందరికి అన్నవస్త్రములకు  రక్షణకు లోటులేని అందరిని కాపాడు మాతగా కరుణా వీక్షణములతో నుండును . అంతకు పూర్వం అతీంద్ర్యయ నాథ ఠాగూర్ అను దేశభక్తుడు సిస్టరు నివేదిత ఆమోదించిన కాషాయ  వస్త్రాలు ధరించిన భారతమాత నాలుగు చేతులలో పుస్తకము కలశము వరికంకులు ఖడ్గములతో జనులకు  శిక్షా, దీక్షా ,అన్న వస్త్రములకు కొదవలేని  అఖండ భారత దేశమును చిత్రించిరి .


ఆపై రెండవ అంతస్తు శూరమందిరమున ప్రాచీనకాలం నుండి దేశరక్షణలోతరించిన  వీరుల చిత్రములు, మూడవ అంతస్తున మాతృమందిరము లోదేశమునేలిన, పరమభక్త మహిళామణులను , నాలుగవ అంతస్తున సాధు మందిరంలో మన దేశమును తమ తపోశక్తితో పునీతము చేసిన సాధుసంతుల విగ్రహములు,ఐదవ అంతస్తునసమావేశ మందిరమున గోడలపై    దేశ చారిత్రక ఘట్టముల చిత్రాలు , ఆరవ అంతస్థున శక్తి మందిరంలో దేవీశక్తి యొక్క వివిధ రూపాలు ఏడవ అంతస్తు న విష్ణువు యొక్క దశావతారాల రూపాలు ఎనిమిది అంతస్థున శివమందిరం లో మహాకైలాస చిత్రణతో నున్నది.


దేశమందెచట లేని విధముగా మన దేశ రాజకీయ సాంస్కృతిక ఆధ్యాత్మిక కేంద్రంగా , విభిన్న జాతుల మతముల భాషల తెగల ప్రాంతముల జనులందరినీ ఏకము చేయు భారతమాత స్ఫూర్తి చిత్రణతో దేశమాతకు అంకితము చేసిన ఈ ధవళమందిరము హరిద్వార్ లో  అత్యధికంగా  దర్శనీయ క్షేత్రంగా పేరొందినది.


🔸🔹🔸🔹🔸

Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat