*25.భాగం*
మణి రాక్షసులుగానీ యింద్రుని జయించి. పట్టుకొని పోయిరా ? అని యనేకవిధములుగా సందేహించుచు బుత్రులతోడను సైన్యము
తోడను" బయలుదేటి యతివేగముగా స్వర్గమునకు బోయెను. దేపలు నిరాకకు
బూర్వమే వజ్రదంష్ట్రుడు దేవతలతో యుద్ధము చేసి పాపాత్ము డాధ్వజమును వారిపై విడిచెను. ఆధ్వజ మెవరిచేత బూజింపబడి విడువబడునో వాని శత్రువులను యముడు కాలదండముచే బ్రజలను సంహరించునట్లు సంహరించును. అటువంటి
ధ్వజము యధావిధిగా బూజించి దేవతల పైకి విడువబడిన దగుటచే నది దేవతలను క్షోభింప జేయ మొదలు పెట్టినది. దానికి భయపడి దేవతలు పాటిపోయిరి. దేవతలు
దెబ్బలు తగిలి పాడిపోయిన తరువాత దేవాంగుడు సైన్యముతో నాయుద్ధభూమికి
బోయెను. రాక్షసు డప్పటి కాధ్వజము నుపసంహరించి తనపట్టణమునకు
బోవనుద్యుక్తుడై యుండగా రాజు చూచి కోపించి బాణముల వర్షించెను.
తరువాతను రాక్షసు లందఱును దేవలుని జుట్టువాఱుకొని యనేకములగు
నాయుధములతో గొట్టిరి. దేవాంగుని సైన్యముపై నాధ్వజమును వజ్రదంష్ట్రుడు
ప్రయోగించెను. అది విడచినతోడనే దేవాంగుని
సైన్యమునంతను దహించినది.
చావగా మిగిలినవారు పదిదిక్కులకును బాటిపోయిరి. తరువాతను రాక్షసు
లందఱును నేకమయి దేవాంగుని మీద ననేకాయుధములు ప్రయోగించిరి.కొందఱు రథమెక్కి పగ్గములు పట్టుకొనిరి. మణికొందఱు సారథిని గట్టివైచిరి.
ఇతరులు యుగంధరుని పట్టుకొనిరి. వేరొక కొందఱు వచ్చి దేవాంగునిచేతిలోని
ధనస్సు విఱి చివైచి యమ్ములపొదులు లాగికొనిరి. మిగిలినయాయుధములను
విసరివైచిరి. గుఱ్ఱములను జిదుకబొడిచిరి. ఇట్లు రాక్షసులకు జిక్కి విడిపించుకో
జాలక యెటు చూచినను దనవారొకరును గంటి కగపడనికారణమున జింతిచు
చుండు దేవాంగుని వజ్రదంష్ట్రాదులు రథమునకు గట్టికొని యాధ్వజము
నుపసంహరించుకొని జయమును బొంది సంతోషపూర్వకముగా దమపట్టణమునకు బోయిరి. దేవాంగునికొడుకు దివ్యాంగుడు దుఃఖసముద్రములో మునిగి
తండ్రి బంధవమును గూర్చి చింతించుచు జావగా మిగిలినవారితో నామోద
పట్టణమునకు బోయి తల్లిని బహువిధములుగా నోదార్చి ప్రజల నందఱను మిక్కిలి
యూఱడించి మంత్రులతో గూడి యుండెను.తరువాతను వజ్రదంష్ట్రుడు తనవారితో గూడివీరమాహేంద్రపట్టణమునకు బోయి దేవాంగుని విశేషముగ సన్మానించెను. తరువాతను రాక్షసరాజ్యగు
వజ్రదంష్ట్రుడు వస్త్రనిర్మాతయగు దేవాంగుని మంచిమాటలాడి యతనితో
స్నేహమును సంపాదించు కొని తనకూతురు పద్మినియనుదాని నిచ్చి వివాహము చేసెను. అగ్నిహోత్రునియ నుమతిపై నామెను వివాహము చేసికొని యగ్నిదత్తయని
పేరువడసిన యామెయందు శ్యాలుడు హలుడు బలుడు నను పేర్లుగల మువ్వురు
కొడుకులను గనెను. వారు శుక్లపక్షపుచంద్రునివలె దినదినాభివృద్ధిని
బొందుచుండిరి. వారిచే వస్త్రములు నేయించి దేవాంగుడు రాక్షసుల కిప్పించేను.తరువాతను దేవలు ధ్వజమును గైకొని మామయొద్ద సెలవంది
తనయామోదపట్టమునకు వచ్చెను. తరువాతను శివుని సేవించుటకై యతడు
కైలాసమునకు బోయి యుండగా నతనిని జూచి శివుడు కోపించి యిట్లనియె ఓరీబుద్ధిహీనుడా ! నే నిచ్చినధ్వజమును రాక్షసుల కిచ్చి దేవతలను హింసింపజేసితివి కావున నీవు మహిమ పోయినవాడ వయి విద్యాధరుడవుకమ్ము. అనియిట్లు శివునిచే
శపింపబడి యచ్చటనుండి యామోదపట్టణమునకు వచ్చి తనవృత్త మంతయు
నచటివారితో జెప్పెను. తరువాతను దేవాంగునిశరీరము లింగమై పోయినది. అది
యామోదపట్టణమున రామలింగేశ్వరుడను పేరున బ్రసిద్ధికెక్కినది.
దేవాంగునికుమారడగు దివ్యాంగుడు రామలింగేశ్వరుని పూజించుచు భూమిని
బాలించుచుండెను.
*సశేషం.......*