🌻 *శుకయోగితో ఆకాశరాజు సంభాషణ* 🌻
🍃🌹ఆకాశరాజు జాగ్రత్తగా ఆలోచించాడు, తనకు గురువర్యుడయిన శుకయోగితో సంప్రదించినట్లయితే చాలా బాగుంటుందని తలచి శుకయోగినీ పిలిపించాడు ఉచితాసనా సీనుని జేసి తగురీతిని పూజించాడు.
🍃🌹తరువాత పద్మావతీ శ్రీనివాసుల ప్రేమ వృత్తాంతము చెప్పి శేషాచలముపై నివసించే శ్రీనివాసునికి తన కుమార్తెను యిచ్చి పెండ్లి చేయవచ్చునా? అనీ శుకయోగిని అడిగాడు. వెంటనే శుకయోగి, ‘‘ఆకాశరాజా! నీవు చాలా అదృష్టవంతుడవు.
🍃🌹ఆ శ్రీనివాసుడు సామాన్య మానవుడు కాడు. అతడు పదునాలుగు లోకాలూ పాలిస్తూన్న శ్రీమన్నారాయణమూర్తియే. పద్మావతి శ్రీనివాసునకిచ్చి వివాహము చేయడమే లోక కళ్యాణానికి కారణమవుతుంది.
🍃🌹నీ జన్మ చరితార్ధమవుతుంది’’. అనగా, ఆ విధముగానే చేసెదనన్నాడు ఆకాశరాజు, శుకయోగి తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏