శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర-4

P Madhav Kumar


🌸🌸🌸🌸🌸🌸🌸🌸

🌹కైలాసమున భృగు మహాముని*

బ్రహ్మదేవుని పరీక్షించుట జరిగినది. ఇంక శంకరుని పరీక్షించుట కొరకు సరాసరి కైలాసమునకు5
ఆ కైలాసమున వెండికొండ పై శివుడు ప్రమధ గణము శివనామ జపధ్యాన మొనర్చుచుండ తన్మయుడై యుండెను. కైలాసాచలము మీద ఎక్కడ వినిననూ పవిత్ర పంచాక్షరీ మంత్ర ప్రణవ నిస్వసములే! ఎక్కడ చూచినా భక్తతతుల శివభక్తి పారవశ్యమే!

భృగు మహాముని పరమేశ్వరుని ప్రత్యేక మందిరపు దిక్కుగా వెడలినాడు. అందమయిన ఆ మందిరము చెంతకు వెడలి కావలియున్న వారిని శంకరుడేమి చేయుచున్నాడని అడిగెను.

అప్పడొకండు ఆర్యా! ప్రస్తుత సమయమున శంకరుడు తన నిజసతి పార్వతీదేవితో గూడి ఏకాంతకేళిలోనున్నాడు. ఇప్పట్టున మీకాయన దర్శన మగుట దుర్లభము. కనుక తాము మఱియొకసారి రావలసినది’’ అని వినయముగా చెప్పెను.

‘కాదు నేనిప్పుడే లోనికిపోయి తీరవలెను’ అన్నాడు భృగువు. కూడదని చెప్పి చెప్పి చూచిరి. కాని, భృగువు మంకుపట్టు వీడలేదు. ఆరుమూడైన మూడు ఆరైనా లోనికి వెడలియే తీరవలెననీ హుంకరించి లోనికి ప్రవేశించినాడు.

కేళీ విలాసముల గరుగుచున్న ఆ యాది దంపతములకు ఆటంటకము కలిగెను. పార్వతీదేవి పరపురుషుడగుభృగువును చూచినదై సిగ్గుదొంతరలు ముంచుకొనిరాగా ప్రక్కకు తొలగిపోయినది.

శంకరున కెక్కడలేని కోపము వచ్చినది. మహోగ్రమూర్తియై

‘‘ఓయీ భృగువూ! మునివై యుండియు నీకు మర్యాద తెలియకపోవుట ఆశ్చర్యముగానున్నది. ఏకాంతముగా కాంతతో శయ్యాగారమున నుండినప్పుడు ఆ మందిరములలో అన్యులు ప్రవేశించరాదను సామాన్య ధర్మమైననూ నీకు తెలియదా?

అసలు నీవు నా అనుమతి లేనిదే లోనికెందులకు వచ్చితివి?

బ్రహ్మవంశమున పుట్టి మహా తపస్సొనరించిన కీర్తిశాలివగు నీయట్టివాని కిట్టి పాపకృత్యమొనరించుట తగినదగునా?

నీ ముఖమును జూచుటయే శుభకరము కాదు. నిన్ను కనికరించివిడుచుచుంటిని కానీ, లేనిచో నిన్ను నాశనమొనరించుట యెంతపని?

ఛీ! వేగముగా బయటకు పొమ్మని దూషించి వదలివైచెను. శివుడు తనను దులిపి దులిపి విడిచినన్నూ భృగువునకు చీమ కుట్టినట్లు కూడ లేకపోయెను.

పైపెచ్చు లోలోపలనవ్వుకొని బైటకు వచ్చివైచెను. ఈ శంకరుడు గూడ సత్త్వగుణ ప్రధానుడు కాకపోయెను. ఏకాంతమందిరమున ప్రవేశించితినని మండిపడినాడు

దానికి మించి తిట్లవర్షమును కురిపించినాడు.

మహా విరాగియైన యీ శంకరునికి కూడ కోపము వచ్చినదే! దీనికి ఆయనకు గల తామసగుణమే కారణము కదా! అని అనుకొనెను.

తామసగుణ ప్రధానుడగుటచే ఈ శంకరుడు తామసభావమున నేను వచ్చిన పనిని గ్రహించలేకపోయినాడు. అని అనుకొనుచూ భృగుమహర్షి కైలాసమును వీడి వెడలినాడు.

*శిష్టపాలక గోవిందా,* *కష్టనివారణ గోవిందా,* *దుష్టసంహార గోవిందా, దురిత* *నివారణ గోవిందా;* |

*గోవిందా హరి గోవిందా,* *వేంకట రమణా గోవిందా,* *గోవిందా హరి గోవిందా,* *వేంకట రమణా గోవిందా.* ||

శ్రీవేంకటేశ్వరునిదివ్య లీలల లో మరికొన్ని తదుపరి సంపుటిలో తెలుసుకుందాం🙏

🌸 *జై శ్రీమన్నారాయణ*🌸

💥సర్వేజనాః సుఖినోభవంతు💥

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat