#శ్రీ వేంకటేశ్వర లీలలు
🐚☀️
🌸 *వేంకటేశ్వరుడు శిలారూపము పొందుట:*
వేంకటేశ్వర స్వామి తొండమానునితో ఇట్లనెను. "రాజేంద్రా! నీకొక సంగతి చెప్పేద వినుము. కలియుగమున మానవులు ఈ విధముననే తెలిసియూ, తెలియకనో మహాపాపములు చేసి వానిని తొలగించుమని క్షణక్షణము నా వద్దకు వచ్చి నన్ను బాధించుచుందురు. నేను వారిని రక్షించి వారి పనులూ పూర్తి చేయనిచో కటినాత్ముడని నన్ను నిందింతురు. నేను రాత్రింబగళ్ళు యీ బాధ పడజాలను. కనుక నేటి నుంచి యీ కలియుగాంతం వరకు మౌనము వహించి ఎవ్వరితో మాట్లాడక శిలా రూపుని వలె నుందును. నా అంతరంగ భక్తులతో మాత్రము మాటలాడుదును."
అని చెప్పి శ్రీనివాసమూర్తి ఆనంద నిలయమందు జేరి పద్మావతిదేవిని తన వక్షమందుంచు కొని నాలుగు హస్తములతో శంఖచక్రములు లేకుండా శిలా ప్రతిమయై మౌనము వహించెను.
తొండమానుడు ఇంటికేగి రాజ్యము మీద ఆశ వదిలి తన కుమారునకు పట్టాభిషేకము చేసి తాను విరాగియై వేంకటాచలమునకు చేరి స్వామికి ప్రీతియైన తులసీ దళములచే నిత్య సహస్రనామ పూజ లొనరించుచూ స్వామి నామధ్యాన మొనర్చుచూ కొన్ని దినములు గడిపెను. అనంతరము తొండమానుని యందు శ్రీ వేంకటేశ్వరునికి అనుగ్రహము గల్గి శాశ్వత మోక్ష సుఖమొసంగి జన్మ రాహిత్య మొనర్చెను.
🙏🏻🐚☀️ 🌷 శ్రీ వేంకటేశ్వర స్వామి వేంకటాచలం (తిరుమల, తిరుపతి) యందు వెలసి ఆనాటి నుండి భక్త సంరక్షణ మొనర్చుచూ కలియుగములో ఇంటింట ఇలవేలుపు అయి నిలిచెను.
🐚☀️🙏🏻🌷
🙏🌺 *గోవిందా...గోవిందా* 🌺🙏
🔔🔔🔔🔔🔔🔔🔔
(▫️ఇప్పటి వరకు వేంకటేశ్వర స్వామి అవతార విశేషాలు తెలుసుకున్నారు.
తరువాయి భాగంలో స్వామి వారి పర్వత నామాలు, తీర్థ మహిమలు 🙏🏻)