శ్రీ వేంకటేశ్వర లీలలు* 🐚☀️ *పార్ట్ -53*

P Madhav Kumar

 

#శ్రీ వేంకటేశ్వర లీలలు

🌸 *శ్రీ వేంకటేశ్వర స్వామి మంగళ హారతి:*

*జయ మంగళం నిత్య*
*శుభ మంగళం*            
            *"జయ మంగళం"*

*నవనీత చోరునకు, నంద కుమారునకు*
*నారదాది మునీంద్రా నందితునకు*
*ప్రవిమలంబైనట్టి ఆనంద నిలయమునకు*
*పద్మావతీ ప్రాణవల్లభునకు*
               *"జయ మంగళం"*

*పంకజాననముఖ భక్తరక్షణునకు*
*శంకరాది మునీంద్ర సేవితునకు*
*వేంకటాచల మందు వేంచేసియున్నటి*
*వేంకటేశ్వర దేవ దేవునకును*
                *"జయ మంగళం"*

*కలి మానవుల పాపకర్మంబులను ద్రుంచి*
*కరుణించు శ్రీజగత్కారునునకు*
*కలిత సంపదలిచ్చి కాపాడి రక్షించు*
*అలివేలు మంగా మనోహరునకు*
                *"జయ మంగళం"*

*ధరను కొండా శంకరాఖ్యుని*
*దయ జూచి సిరులిచ్చి*
*పోషించు శ్రీపతికిని*
*సరసకవి పున్నయ్య శాస్త్రినిన్ గృపనేలు*
*వరదుడౌయా శ్రీనివాసునకును*
               *"జయ మంగళం"*

🙏🌹🌹🌹🌹🌹🌹🌹🙏

🌸 *పర్వత నామములు:*

శ్రీ వేంకటేశ్వర స్వామి నివసించు పర్వతమునకు ఏడు నామములు గలవు. అవి వచ్చుటకు కారణము...

⛰️ *1. శేషాచలము :
ఆదిశేషుని రూపమున ఉండుట చేత

⛰️  *2. వేదాచలము:*
వేదములు ఆ పర్వతమున ఇమిడి ఉన్నందు వల్ల

⛰️ *3. గరుడాచలము:*
గరుత్మంతుని చేత భూలోకమున చేర్చినందున

⛰️ *4. వృషభాద్రి:*
వృషాసురుడు అను రక్కసుడు అక్కడ మరణించి మోక్షము చెందినందున

⛰️ 5 *. అంజనాద్రి:*
అంజనాదేవి తపస్సు చేసి హనుమంతుని కన్న చోటుగాన

⛰️ *6. ఆనందగిరి:*
వాయుదేవుడు, ఆదిశేషుడు పంతమున ఆనంద పర్వతము ఇందులో చేరుటచే

⛰️ *7. వేంకటాచలము:*
పాపములు పోగొట్టునది గనుక

అని ఏడు పేర్లు సార్ధకమై ఈ పర్వతము ఒప్పుచున్నది.

*శ్లోకము:*

*సర్వ పాపాని వేం ప్రాహుః*
*కటస్తద్ధాహ ఉచ్యతే*
*తస్మా  ద్వేoకట శైలోయం*
*లోక విఖ్యాత కీర్తి మాం.*

(తరువాయి భాగం రేపు)...

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat