శబరిమలై మకరవిళక్కు ఉత్సవం ముగిసిన పిమ్మట చివరిదినం అనగా ప్రతియేటా జనవరి 21 ఉదయం శ్రీ స్వామివారి సన్నిధానం మూసివేయుదురు. ఆ దినం గుడి తలుపులు మూసి బీగంవేసి పందల రాజు వారికి అప్పజెప్పి మరల ఆ బీగములను మేల్ శాంతి వర్యులు తిరిగి పుచ్చుకొని సన్నిధానము పైన యుండు తన గదికి వచ్చెదరు. తదుపరి మాసమే మరలా సన్నిధి తెరచుట. కాని సన్నిధి తెరవక పోయినను సన్నిధానము బయట యుండే బలిపూజ మాత్రము ప్రతి దినము మేల్ శాంతి వర్యులు చేయవలసినదే. అలాగే సన్నిధానము ఆగ్నేయ దిశలో కాంతమలై పొన్నంబల స్వామివారిని ఉద్దేశించి ఒక ఆరిపోని దీపమును కూడా వెలిగించే పరిపాటి యున్నది. వాటిని మేల్ శాంతి వర్యులే నిర్వహిస్తారు. శబరిమలై యాత్ర ముగిసి స్వస్థలం మరలిన సర్వులు సుఖశాంతులతో వర్ధిల్లాలనియు , మరల మరల భక్తులు యధావిధిగా మాలధరించి శబరిమల యాత్ర చేయుటకు తయారుకావలయుననియు ప్రార్థనగా మేల్ శాంతి వర్యులు అనునిత్యం నిర్వర్తిస్తారు. అందుకే ఏడాదికోమారు ఎంపికయ్యే శబరిమలై మేల్ శాంతివర్యులు తిరుంబా శాంతిగా ఏడాది కాలం ఇంటికి వెళ్ళక శబరిమలై యందే బ్రహ్మచర్య దీక్ష వహిస్తు
మనకొరకై అనునిత్యం ప్రార్థిస్తూ అచ్చటి బలిపూజలు నిర్వర్తిస్తారు. వారి పూజలలో సంతసించిన స్వామి అయ్యప్ప సర్వులను అనుగ్రహించి సుఖశాంతులను ప్రసాదింతురు గాక !
🙏🪷ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప🥀🙏