🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸
🌿మహాలక్ష్మి అమ్మవారిని శ్రీసూక్తంలో పద్మ విశేషాలతో వర్ణిస్తారు.
🌸ఋగ్వేదంలో అమ్మవారి గురించి ఎన్నో ఋక్కులు కనబడతాయి.
🌿“ పద్మాననే పద్మ ఊరు పద్మాక్షీ పద్మ సంభవే”
అని అన్ని పద్మ విశేషణాలు వాడారు.
🌸పద్మాల వంటి కన్నులు కలది, పద్మం ఆధారంగా ఉన్నది, పద్మం వంటి మోము కలది, పద్మం నుండి పుట్టినది అని సూక్తం వర్ణిస్తుంది.
🌿పంకం నుండి పుట్టినది పద్మం కానీ ఆ చిక్లీతను (బురదను) అంటించుకోదు.
🌸సంసారంలో ఆ పద్మంలాగా ఉండాలని సూచిస్తుంది.
🌿పద్మం సూర్యుని చూసి వికసిస్తుంది, అలాగే మనం కూడా పరమాత్మ వైపు మంచి విషయాలపై మాత్రమె అనురక్తి ఉండాలి అని మరొక సంకేతార్ధం.
🌸నీటి మీద ఉన్న ఆ పద్మం చాలా చంచలం.
ఆ పువ్వు మీద ఆసీనురాలైన ఆవిడ కూడా ధర్మం ఉన్నన్నాళ్ళే వారి దగ్గర ఉంటుంది.
🌿విష్ణు నాభి కమలం నుండి ఉద్భవించాడు చతుర్ముఖ బ్రహ్మ, అటుపై అక్కడనుండి సృష్టి ఆవిర్భావం.
ఆ బ్రహ్మతత్త్వాన్ని తెలిపే సంకేతంగా మరొక పద్మం.
🌸అమ్మవారి రెండు కర కమలాలలో భౌతిక, ఆధ్యాత్మిక ఉన్నతి అనుగ్రహాలు ఉన్నాయి.
వాటికి చిహ్నంగా అలా కనిపిస్తుంది.
🌿ఆ తల్లి రూపాన్ని ఋషులు, మహర్షులు ధ్యానతపస్సులో దర్శించి తరించారు. వాటినే మనకు అందించారు.
🌸లక్ష్మీదేవి 16 రకాల సంపదను అనుగ్రహించే తల్లి :.......
🌿జ్ఞానం, తెలివి, బలం, శౌర్యం, వీరం, అందం, జయం, కీర్తి, ధృతి, నైతికత, ధనం, ధాన్యం, ఆనందం, ఆయుష్షు, ఆరోగ్యం మరియు సంతానం.
🌸ఆ తల్లి మానవుల కోరికలను తీర్చేందుకు ఎనిమిది రూపాలలో అష్టలక్ష్మిగా సుప్రసిద్ధం.....
🌿నిత్యం శ్రీ వేంకటేశుని వక్షస్థలంపై వసించి మనల్ని అనుగ్రహించి, మన తరపున మొరలు స్వామికి నివేదించి మనల్ని రక్షిస్తూ, అనుగ్రహిస్తున్న మా అమ్మ లక్ష్మీదేవకి సాష్టాంగనమస్కారం చేస్తూ ఆవిడ అనుగ్రహాన్ని అభిలషిస్తూ....స్వస్తి..🙏🌹🎻
🙏🌹మహాలక్ష్మీ నమోస్తుతే🌹🙏
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸