#మాట మంత్రం ఎలా అవుతుంది?

P Madhav Kumar

మాట్లాడే శక్తి ఆలోచనా శక్తి మనిషికి మటుకే ఇచ్చాడు భగవంతుడు అది లేకుంటే జంతువుకీ మనిషికి తేడా ఉండదు.


మాట మంత్రం లాగా పనిచేస్తుంది ఎప్పుడైతే దాన్ని పవిత్రంగా శుద్ధంగా వాడుకుంటామో అప్పుడు ఆ మాటకు విలువ పెరుగుతుంది..


అగ్గిపుల్లతో దీపం పెట్టవచ్చు, ఇల్లు తగలబెట్టవచ్చు, ఎలా వాడుకుంటారు అనేదే వివేకం, అహంకారం వేవికాన్ని పోగొడుతుంది.


బీజం అంటే అక్షరం , ఈ అక్షర బీజాన్ని ప్రతి మాటలోను పలుకుతున్నాము..మాట ఎలా పలకాలో అమ్మ దగ్గర నేర్చుకునే టప్పుడే ఉపదేశం పొందుతారు ప్రతి ఒక్కరు..


మాట్లాడే ప్రతి మాట అక్షర సముదాయం అది పద్దతిగా పలడం అంటే మంచి మాటలు పలకడం మంచిని కలిగిస్తుంది, చెడ్డ మాటలు చెడును కలిగిస్తుంది. మాటకు అంత శక్తి ఎలా వచ్చింది ఇది పలికేది మానవుడే కదా అని అనుకుంటే ప్రతి అక్షరం బీజం దానికి ప్రకృతిలో ఉన్న విశ్వప్రాణ శక్తి స్పందిస్తుంది.. 


ఆ ప్రకంపనలు శరీరాన్ని ఆకర్షిస్తోంది..అదే కాస్మిక్ ఎనర్జీ అదే ప్రకృతిలో ని శక్తి..ఈ శక్తి మన వాక్కుతో స్పందించాలి అంటే ఏ బీజాన్ని దేనికి జత పరచాలి అనేది తెలిసి ఉండాలి అదే మంత్రం ఈ మంత్ర శాస్త్రంలో ఏ బీజాన్ని దేనికి చేరిస్తే ఎటువంటి ప్రకంపనలు కలుగుతుంది దాని ప్రయోజనం ఏమిటి అనేది మంత్ర శాస్త్రం


ఒక మంత్రం ఒకరికి ఫలించి ఒకరికి ఫలించక పోవడానికి కారణం వారి వాక్కు వారు పూజ చేసే టప్పుడు జపం చేసే టప్పుడు సంకల్పమ్ చెప్పే టప్పుడు ఇది నాకు ఫలిస్తుంది అనుకుని నమ్మకంగా చేసిన వారికి ఫలిస్తుంది దానికి తగ్గ నియమాలు పాటించి నప్పుడు అది పనిచేసే శక్తి మీకు కలుగుతుంది, మొదలుపెట్టక ముందు నుండి పెట్టాక ఇది జరుగుతుంది ఫలితం వస్తుందా అన్న అనుమానం వల్ల మీ వాక్కు మీకు శాపం అవుతుంది.. ఎవరు పలికిన అదే బీజం ఎవరు చేసిన అదే పద్దది కానీ శక్తి అనేది మీ సంకల్పమ్ వల్ల లభిస్తుంది.. అది తెలియక మీ సాధన వృధా అవుతుంది.


వర్గాలు గా వర్ణాశ్రమం ధర్మాన్ని నిర్ణయించి నప్పుడు.. ఇది ఒకే వర్గం చేతిలో ఉండేలా నిర్ణయించారు దానికి కారణం ఇది దుర్వినియోగం కాకూడదు అని అలాగే అందరూ నేర్చుకుంటే వీరి ప్రత్యేకత ఉండదు అని రహస్యం గా ఉపదేశాలు ఇచ్చి నేర్పే వారు ఎవరైనా వారి అనుమతితో వారి వర్గంలో నే నేర్చుకోవాలి అని ఎవరైనా వారి ఉపదేశం లేకుండా తెలుసుకుని పాటిస్తే  చాలా రకాల బాధలు వస్తుంది అని భయపెట్టే విధంగా కొన్ని ఆంక్షలు విధించారు..అందువల్ల కొన్ని శాస్త్రాలు ఒక వర్గానికి అంకితం అయితే కొన్ని రహస్య సాధనలు విధానాలు కొన్ని కుటుంబాలకు పరిమితమై మరుగున పడిపోయి చివరికి వారి తరానికి కూడా అందుబాటులో లేకుండా పోయింది.


కొందరు దానికి కట్టుబడ్డారు వారి లోనే కొందరు కొత్త సాంప్రదాయం శాస్త్రాలు కొత్తగా తాంత్రిక ప్రయోగాలు కనిపెట్టే ప్రసిద్ధి పొందారు అందుకే ఇప్పుడు అన్ని రకాల శాస్త్రాలు ఏర్పడ్డాయి.


గురువు లేకుండా మంత్రం జపించ కూడదు కారణం ఈ మంత్రం లోని బీజాలకు నాడులు స్పందిస్తుంది తప్పుగా పలికితే అది నాడీ వ్యవస్థ పైన ప్రభావం చూపుతుంది, అలాగే దేనికి ఎది ఉపయోగ పడుతుంది తెలుసుకుని చేయాలి..


ఒక జబ్బు చేసి నప్పుడు సొంతంగా ఔషధం మింగకూడదు ఒక జబుకి ఒకే రకం మందులు అందరికి పని చేయదు ఒకే రకం జబ్బుకి అనేక రకాల ఔషధాలు ఉన్నాయి.. అలాగే ఒక సమస్యకు అనేక రకాల పరిష్కరాలు వారి వారి జాతకాన్ని బట్టి కూడా ఉంటుంది.. అందుకే ఏది ఎలా చేయాలి అని చెప్పే వారు ఉంటే అది తెలుసుకుని చేయాలి..


ఉదాహరణకు ఒక ఔషధం చేసే సమయంలో పఠించే మంత్రం ఉంటుంది అది చెప్తూ చేయడం వల్ల దానికి ప్రాణ శక్తి వస్తుంది అలాగే అది తీసుకునే రోగికి కూడా ఒక మంత్రం చెప్తూ సేవించే వాళ్ళు త్వరగా ఆ మందు వారికి ఆరోగ్యాన్ని ప్రసాదించేది.. అది రహస్యంగా ఉంచడం వల్ల ఔషధ తయారీ తెలుసు కానీ దాన్ని మంత్ర శాస్త్రం మరుగైపోయింది.


మనకు తెలిసి కూడా పాము కాటు తెలు కాటు, దిష్టి మంత్రాలు ఆడవాళ్లు కూడా తెలిసి ఉండేవి ఇప్పుడు అవి మూఢనమ్మకాలు అయిపోయింది.. పద్మనాభ స్వామి గుడిలో నాగ బంధానికి ప్రపంచం మొత్తం సమాధానం లేని ప్రశ్నగా మిగిలిపోయిన ఇవన్నీ ట్రాష్ అనే బుద్ది హీనులు ఉన్నారు...


కోటి మందికి ఈ శాస్త్రాల విలువ తెలుసుకుంటే అందులో కొందరు వివరం తెలుసుకుంటారు, అందులో కొందరు సాధన తెలిసుకుంటారు, అందులో కొందరు సాధన నేర్చుకుంటారు , అందులో కొందరు సాధన మొదలు పెడతారు ,కొందరు సాధనలో కొనసాగుతారు , అందరిలో ఒక్కడు సాధన సఫలం అవుతాడు ఆ ఒక్కడు కోటి మందికి నేర్పగల గురువు అవుతాడు ..ఇది నిజమా అని అనుకునే ముందు పద్మ పురాణం గురించి నేను పెట్టిన సందేశం గుర్తు చేసుకోండి ఆ మెస్సాజ్ కి ఇప్పుడు సమాధానం దొరుకుతుంది.


కొన్ని మంత్రాలు ఔషదంలాగా ఉపయోగ పడటానికి మన ఋషులు మనకు అందించారు అలా అందించిన వారిలో ఉన్నది ఋషులు వారికి కులం మతం తో పని లేదు ఎందుకంటే ఋషులు అందరూ బ్రాహ్మణులు కాదు ఎదో  కులం వారు కాదు , అన్ని వర్గాలు వారు ఋషులు ఉన్నారు ,అందుకే వారు కులం ప్రస్తావించలేదు అలాగే ఆ శాస్త్రం అర్థం తెలుసుకుని చేసే వాడు లేదా చేసిన అనుభవం ఉన్నవారో అయితే


నేర్చుకునే వారికి ఆటంకాలు ఉండదు అనే నియమాలు తప్పా , భయనకమైన శిక్షలు వాళ్ళు రాయలేదు ఎందుకంటే వారు పరిశోధించి ఈ శాస్త్రాలను అందించింది మానవ శ్రేయస్సుకోసమే..


అమ్మవారి అనుమతి తోనే ఏది ఎలా చేయాలో వివరంగా ఇచ్చినవి నమ్మకం ఉన్న వారు సాధన చేయండి, చేయడం ఇష్టం లేకున్నా సనాతన ధర్మం గురించి గొప్పగా తెలుసుకోండి, చేయకున్న పర్వాలేదు ఎవరిని విమర్శించకండి.. భగవంతుడు ఇచ్చిన వాక్కుని పొదుపుగా వాడుకోండి.. నెగటివ్ ఎనర్జీ తగ్గుతుంది.. ఎక్కువగా మౌనంగా ధ్యానించడం అలవాటు అయితే మంత్ర శక్తి మన లోనే పుడుతుంది.


      🚩 సర్వేజనా సుఖినోభవంతు🚩

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat