సముద్ర మధనంలో ఉద్భవించిన లక్ష్మీదేవిని శ్రీమన్నారాయణుడు ఈ క్షేత్రంలోనే వివాహమాడాడు.* 💎

P Madhav Kumar


 * తిరుదేవనార్ తొగై* 

🍃ఈ సన్నిధి తిరునాంగూర్ గ్రామంలో ఉన్నది. దైవనాయకన్ పెరుమాళ్. కడల్ మకళ్ తాయార్. స్వామికి మాధవ పెరుమాళ్ అని మరి ఒక తిరునామం కలదు. ఈ సన్నిధి మన్ని నది ఒడ్డున ఉన్నది. వశిష్ఠుడు స్వామిని గురించి తపస్సు చేసి స్వామి ఆశీస్సులు పొందాడు.


 *స్థలపురాణం:* 

🍃సముద్ర మధనంలో ఉద్భవించిన లక్ష్మీదేవిని శ్రీమన్నారాయణుడు ఈ క్షేత్రంలోనే వివాహమాడాడు అని ప్రతీతి. దేవతలు స్వామిని పెళ్లికొడుకుగా చూడటానికి గుంపుగా వస్తారు.


🍃అందుకే ఈ క్షేత్రానికి దేవనార్ తొగై అని పేరు వచ్చింది. సన్నిధి పుష్కరిణి పేరు శోభన పుష్కరిణి, విమానం పేరు శోభన విమానం. పుష్కరిణికి దేవసభా పుష్కరిణి అని ఇంకొక పేరు ఉన్నది.


🍃స్వామిని దర్శించుకున్న తరువాత పెళ్లిళ్లు కానీ వాళ్లకు పెళ్లిళ్లు అవుతాయని, పిల్లలు లేని వారికి పిల్లలు పుడతారని భక్తుల విశ్వాసం.

Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat