*శ్రీహరి అవతారాలనూ, ఆయుధాలనూ, వాహనాదులనూ నమస్కారం చేస్తూ* 🌺
దేవతల పూజా విధానం :
ఇలాగే విష్ణుదేవుని పూజించునపుడు ఓం వాసుదేవాసనాయ నమః మంత్రంతోవిష్ణుని అసనాన్ని పూజించాలి. ఆ తరువాత
*ఓం వాసుదేవమూర్తయే నమః
*ఓం అం ఓం నమోభగవతే వాసుదేవాయ నమః
*ఓం ఆం ఓం నమోభగవతే సంకర్షణాయ నమః
*ఓం అం ఓం నమోభగవతే ప్రద్యుమ్నాయ నమః
*ఓం అః ఓం నమో భగవతే అనిరుద్ధాయ నమః
అనే మంత్రాల ద్వారా సాధకుడు విష్ణు చతుర్వ్యూహాన్ని నమనం చేయాలి.
*ఓం నారాయణాయ నమః
*ఓం తత్సద్ బ్రహ్మణే నమః
*ఓం ప్రారాం విష్ణవే నమః
*ఓం క్రౌం నమోభగవతే నృసింహాయనమః
*ఓం భూః ఓం నమోభగవతే వరాహాయ నమః
*ఓం కంటం వంశం వైన తేయాయ నమః
*ఓం జం కం రం సుదర్శనాయ నమః
*ఓం ఖం తం దం షం గదాయై నమః
*ఓం వం లం మం క్షం పాంచజన్యాయ నమః
*ఓం ఘం ధం భం హం శ్రియై నమః
*ఓం గండం వంసం పుష్యై నమః
*ఓం ధం షం సంసం వనమాలాయై నమః
*ఓం సం దం లం శ్రీ వత్సాయ నమః
*ఓం ఠ౦ భ౦ యం కౌస్తుభాయ నమః
*ఓం గురుభ్యో నమః
*ఓం ఇంద్రాది భ్యోనమః
*ఓం విష్వక్సేనాయ నమః అనే మంత్రాలతో భగవంతుడైన శ్రీహరి అవతారాలనూ, ఆయుధాలనూ, వాహనాదులనూ నమస్కారం చేస్తూ పూజించి శివపూజ వలెనే ,ఆసనాది. ఉపచారాలను సమర్పించాలి.
*విష్ణుభగవానుని విశేష పూజకై అయిదు ప్రకారాల రంగులు కలిపిన*
శంకర దేవా! విష్ణు భగవానుని శక్తులలో సరస్వతీ దేవి ప్రముఖమైనది. ఆమెనూ మంగళకారిణిగా సంబోధిస్తూ ఓం సరస్వత్యై నమః అనే మంత్రం ద్వారా నమస్కారం.చేసి ఈ క్రింది మంత్రాలతో షడంగన్యాసం చేయాలి.
*ఓం హ్రాం హృదయాయ నమః
*ఓం హ్రీం శిరసే నమః
*ఓం హ్రూం శిఖాయై నమః
*ఓం ప్రైం కవచాయ నమః
*ఓం హౌం నేత్రత్రయాయనమః
*ఓం ప్రా అస్త్రాయ నమః
🌺సరస్వతీ దేవి యొక్క యెనిమిది శక్తులైన శ్రద్ధాదులను ఈ క్రింది మంత్రాలతో అర్చించాలి.
*ఓం హ్రీం శ్రద్ధాయై నమః
*ఓం హ్రీం బుద్ద్యై నమః
*ఓం హ్రీం కలాయై నమః
*ఓం హ్రీం మేధాయై నమః
*ఓం హ్రీం తుష్యై నమః
*ఓం హ్రీం పుష్యై నమః
*ఓం ప్రభాయై నమః
*ఓం హ్రీం మత్యై నమః
🌺తరువాత క్షేత్రపాలునికీ, గురువుకీ, పరమ గురునికి ఈ మంత్రాలతో పూజలు చేయాలి.
*ఓం క్షేత్రపాలాయ నమః
*ఓం గురుభ్యో నమః
*ఓం పరమ గురుభ్యో నమః
🌺తరువాత సరస్వతీదేవికి కమలవాసినీ రూపంలో అసనాది ఉపచారాలను సమర్పించాలి. పూజల తరువాత సూర్యాది దేవతలను వారి వారి మంత్రాలను చదువుతూ పవిత్రారోహణం చేయించాలి.సదాశివాదులారా! విష్ణుభగవానుని విశేష పూజకై అయిదు ప్రకారాల రంగులు కలిపిన. చూర్ణంతో వజ్రనాభమండలాన్ని నిర్మించాలి. దీనికి సమాన పరిమాణంలో పదహారు. కోష్టకాలతో నిర్మించాలి.వజ్రనాథ మండలం తయారు కాగానే వ్యాసం చేసుకొని శ్రీహరిని పూజించాలి.హృదయ మధ్యంలో విష్ణుభగవానుని, కంఠంలో సంకర్షణుని, శిరంపై ప్రద్యుమ్నుని, శిఖాభాగంలో అనిరుద్ధుని, సంపూర్ణ శరీరంలో బ్రహ్మనీ, రెండు చేతులలో శ్రీధరునీభావించుకొని న్యాసం చేసుకోవాలి.