*శోకరహితులునగు బ్రాహ్మణులు కల్కిని చూచి ఎలా స్పందించెను* 🌹
విశాఖయూవభూపాల పాలితా స్థాపనిర్జితాః
బ్రాహ్మణాః కల్కి మాలోక్య పరాం ప్రీతి ముసాగతాని
తతో విష్ణుయగాః పుత్రం ధీరం సర్వగుణాకరమ్
కల్పిం కమలపత్రాకం ప్రోవాడ విరిరాదృతమ్.
🌺అర్ధం:
విశాఖ యూపభూపాలునిచే రక్షింపబడువారు, శోకరహితులునగు బ్రాహ్మణులు కల్కిని చూచి అత్యంతము ప్రసన్నులైరి. ధీరుడు, సర్వగుణ సంపన్నుడు, పద్మనేత్రుడగు పుత్రుని విద్యాభ్యాసమునకు యోగ్యునిగ తలచి తండ్రి విష్ణుయశసుడు ఇట్లు పలికెను.
తాత! తే బ్రహ్మసంస్కారం యజ్ఞసూత్ర మనుత్తమమ్
సావిత్రీం వాడయిస్వామి తతో వేదాన్ పరిషన్
కల్కిరువా........
కో వేదః కాంచ సావిత్రీ కేన సూత్రేణ సంస్కృతాః
బ్రాహ్మణా విదితా లోకి తత్తత్వం వద తాత మామ్.
🌺అర్ధం:
కుమారా! యజ్ఞసూత్రధారణరూపమగు ప్రధానమయిన బ్రహ్మసంస్కారమును గావించి సావిత్రిని ( గాయత్రి మంత్రమును) చెప్పించెదను. పిమ్మట నీవు వేదముల అధ్యయనము జేయుము అనగానే కల్కి యిట్లు పలికెను. తండ్రీ! వేద మననేమి? సావిత్రి ఎవరు? ఎటువంటి సూత్రసంస్కారముచే లోకమున బ్రాహ్మణులుగ ప్రసిద్ధ మగుచున్నారు? ఈతత్త్వము లన్నియు నాకు చెప్పుము.
పిలోవాచ......
పేదో హరేర్బాక్ సావిత్రీ వేదమాతా ప్రతిష్ఠితా:
త్రిగుణం త్రివృతస్సూత్రం తేన విప్రాః ప్రతిష్ఠితాః
దశయత్తైః సంస్కృతా యే బ్రాహ్మణా బ్రహ్మవాదినః
తత్ర వేదాశ్చ లోకానాం త్రయాణామిహ పోషకాః
🌺అర్ధం:
తండ్రిపలికెను. హరియొక్క వాక్కు వేదము. సావిత్రి వేదమాత. మూడుగ చేయబడిన సూత్రమును మూడుమార్లు ధరించుటవలన బ్రాహ్మణునిగా ప్రసిద్ధుడు.దశయజ్ఞములచే సంస్కరింపబడిన వేదవేత్తలగు బ్రాహ్మణులు లోకత్రయరక్షకము లగు వేదములకురక్షకులు.
🌹 తరువాయి భాగం రేపు చదువుదాం.