*స్వామియే శరణమయ్యప్ప*
ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడకు , కృష్ణా జిల్లా ముఖ్య పట్టణమైన మచిలీపట్నానికి చేరువలో జంక్షన్ గా ఉంది...
ఈ సుందర ఆలయాన్ని దర్శించదలుచుకున్న భక్తులు రోడ్డు మార్గంగా
విజయవాడ నుంచి 65 కిలోమీటర్లు, మచిలీపట్నం నుండి 25 కిలోమీటర్లు ,
గుంటూరు జిల్లా రేపల్లె నుంచి 15 కిలోమీటర్లదూరంలో రోడ్డు మార్గం ద్వారా బస్ లేదా ప్రైవేటు వాహనాల ద్వారా చేరుకోవచ్చు...
ఈ ఆలయం గ్రామం జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న భక్తుల ద్వారా ఇచ్చిన నిధులతో దాతల సహకారంతో నిర్మించడమైనది,
ప్రతిష్ట జరిపిన నాటి నుంచి నేటి వరకు స్వామివారికి నిత్యం ధూప దీప నైవేద్యాలు మరియు ప్రత్యేక విశేష దినములలో పూజా క్రతువులు, ఆర్జిత సేవలు నిర్వహించడం జరుగుతుంది.
ఈ ఆలయంలో స్వామి వారిని దర్శించిన భక్తులకు వారి కోరికలు తీర్చి కొంగుబంగారంగా స్వామివారి లీలలు జరుగుతున్నాయి...
స్వామివారికి ప్రతిరోజు ఉదయం గణపతి హోమం తో ప్రారంభమై రాత్రికి పవళింపు సేవ అయిన హరివరాసనం వరకు అన్ని పూజా కార్యక్రమాలు శబరిమల సన్నిధానంలో మాదిరిగా ఆలయ ప్రధాన అర్చకులు *బ్రహ్మశ్రీ భాను నంబూద్రి* గారి ద్వారా జరుగుతూ ఉన్నాయి...
భక్తులకు ముఖ్య విశేష రోజులైన పుట్టినరోజు , పెళ్లిరోజు లాంటి ప్రత్యేక రోజులను స్వామివారి ఆలయంలో నిత్యం ఉదయం జరిగే గణపతి హోమం లో పాల్గొనే విధంగా , కార్యక్రమాలను భక్తులకు చేరువ చేర్చాలని కమిటీ వారు గణపతి హోమం 550/- రూ..లకు సమకూరుస్తున్నారు...
స్థానికులే కాకుండా దూర ప్రాంతం వారు కూడా ఈ గణపతి హోమంలో ప్రత్యక్షం లేదా పరోక్షంగా పాల్గొంటున్నారు...
భక్తులు సద్వినియోగం చేసుకోగలరని కోరుతున్నాము...
ఇట్లు,
ఆలయ కమిటీ
*శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి క్షేత్రం చల్లపల్లి కృష్ణాజిల్లా ఆంధ్ర ప్రదేశ్*