*నవవ్యూహార్చన విధి పూజ* :
🌺తరువాత ఋగ్వేద లోని మంత్రాలతో సూర్య, చంద్ర, అగ్యాదులను ధ్యానించు. కోవాలి. తరువాత అష్టదళకమలంపై ఎనిమిది నెలలో భగవంతుడైన కేశవుని వద్దనే అవస్థితములై వుండు విమలాది శక్తులను విన్యస్తం చేసి తొమ్మిదవ శక్తిని కర్ణికపై స్థాపించాలి.
🌺వాటిని ధ్యానించిన పిమ్మట యోగపీఠానికి విధ్యుక్తంగా పూజ చేయాలి, తరువాత -మదల మనస్సు ద్వారా విష్ణుభగవానుని అంగసహితంగా ఆవాహనం చేసి ఆ యోగపీఠంపై ప్రతిష్టించాలి. అపుడు తూర్పు మొదలుగా నాలుగు దిక్కులలో నున్న కమలదళాలపై హృదయాది న్యాసాన్ని చేయాలి. కమలము యొక్క మధ్య భాగంలోనూ కోణాలపైననూ ఈ క్రింది విధంగా అస్త్రమంత్ర వ్యాసాన్ని గావించాలి.
*తూర్పువైపు దళంలో - హృదయాయ నమః
*దక్షిణం వైపు దళంలో - శిరసే స్వాహా
*పశ్చిమం వైపు దళంలో - శిఖాయై వషట్
*ఉత్తరం వైపు దళంలో - కవచాయ హుం
*మధ్యంలో - నేత్రత్రయాయవైషట్
*కోణంలో - అస్త్రాయ ఫట్ అంటూ న్యాసం చేయాలి.
🌺తరువాత పూర్వాధి దిశల్లో యథాక్రమంగా సంకర్షణాదులను స్థాపించాలి. తరువాత తూర్పు, పడమటి ద్వారాలలో ఓం వైనతేయాయ నమః అంటూ గరుత్మంతుని స్థాపించాలి. దక్షిణ ద్వారంలో ఓం సుదర్శనాయ నమః ఓం సహస్రారాయనమః అని ఉచ్ఛరిస్తూ వేయి అర్రలున్న సుదర్శన చక్రమును స్థాపించాలి.
🌺 దక్షిణ ద్వారంలోనే ఓం శ్రియైనమః మంత్రంతో శ్రీ అనే అక్షరాన్ని వ్యాసం చేసి ఉత్తర ద్వారంలో ఓం లక్ష్మ్యై నమః అనే మంత్రంతో లక్ష్మీదేవిని ప్రతిష్ఠించాలి. తరువాత ఉత్తర దిశలో ఓం గదాయై నమః అంటూ గదనీ, కోణాలలో ఓం శంఖాయై నమః అంటూ శంఖాన్నీ న్యాసం చేయాలి.