*🌹మధుర- బృందావనం🙏* కృష్ణుని జన్మస్థలం...

P Madhav Kumar

🌿శ్రీకృష్ణ పరమాత్మ జన్మించిన ప్రదేశంగా ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని మధురకు ప్రత్యేక గుర్తింపు ఉంది.


🌸మథుర మరియు బృందావనం అనగానే శ్రీకృష్ణుడు, గోపికలు గుర్తుకు వస్తారు.


🌿బాల్యంలో యశోదా తనయుడు ప్రదర్శిం చిన లీలలెన్నో మదిలో మెదలుతాయి. ఇక్కడి సందర్శనీయ ప్రాంతాలెన్నో ఆనాటి కృష్ణలీలలతో ముడిపడినవే.


🌸గోపికావస్త్రాపహరణం, రాసలీల తదితరాలన్నీ ఇక్కడో చోటు చేసుకున్నట్లు భక్తులు భావిస్తుంటారు. 


🌿సందర్శిం చేందుకు ఎన్నో ఆలయాలు కూడా ఉన్నాయి. దగ్గర్లోనే మరెన్నో చారిత్రక, పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉన్న స్థలాలు కూడా ఉన్నాయి. 


🌸ఉత్తర భారతదేశ యాత్రలో తప్పని సరిగా దర్శించాల్సిన పుణ్యక్షేత్రం మథుర, బృందావనం .


      🌷కృష్ణుని జన్మస్థలం...🌷


🌿మథుర భారతదేశంలోని ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న హిందూ పుణ్యక్షేత్రాలలో ఒకటి. ఇది దాదాపు ఆగ్రాకు 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. 


🌸ఇది బృందావన్‌కు 12 కి.మీ. దూరంలో వుంది. ఇది కృష్ణుని జన్మస్థలం. దేవకి, వసుదేవులకు జన్మించాడు. 


🌿శ్రీకృష్ణుడు చెరసాలలో పుట్టాడు. ఇప్పుడు ఆ చెరసాలను శ్రీ కృష్ణ జన్మభూమి అంటారు. ఇది మధుర కాంప్లెక్స్‌లో వుంది. 


🌸ఈ గుడిని శ్రీకృష్ణుని ప్రేమకు అంకితం  ఇది మధుర పద్ధతిలో నిర్మించిన సాంస్కృతిక  భవంతి.


🌿ఇక్కడి కేశవ్‌దేవ్‌ దేవాలయం హిందువులకు అత్యంత పవిత్రం. 

ఈ దేవాలయాన్ని శ్రీకృష్ణుడి మునిమనుమడైన వజ్రనాభుడు దాదాపు ఐదువేల సంవత్సరాల కిందట నిర్మించాడని స్థలపురాణం. 


🌸ఈ దేవాలయంలో జన్మాష్టమితోపాటు వసంత పంచమి, మహాశివరాత్రి, గోపాష్టమి, దీపావళి మొదలైన పండుగలను ఎంతో ఘనంగా నిర్వహిస్తారు.

 

🌷చూడదగిన ప్రదేశాలు..🌷


🌿శ్రీకృష్ణ జన్మభూమి దేవాలయం, గర్భ గుహ, భాగవత భవన్‌తోపాటు కృష్ణుడు బాల్యంలో నడయాడిన గోకులం, బృందావనం వంటి ప్రదేశాలు కూడా మధుర జిల్లాలోనే ఉన్నాయి.


🌸 మధుర నుంచి బృందావనం 11 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ గోవిందదేవ్‌, మీరాబాయి, మదనమోహన దేవాలయాలు ప్రసిద్ధి పొందినవి. బృందావనానికి సమీపంలోనే గోవర్ధన పర్వతం ఉంది. 


🌸నేటికీ దీపావళి పండుగ తరవాత రోజున గోవర్ధన పూజ నిర్వహించడం ఆనవాయితీ. 


🌿గోవర్ధన గిరిని చిటికెన వేలుపై ఏడు రోజులు ఎత్తి పట్టుకొన్న శ్రీకృష్ణుడు, ఈ రోజునే ఇంద్రుడి గర్వభంగం చేశాడని చెబుతారు. 


🌸ఈ పర్వతాన్ని స్థానికులు కృష్ణుడి ప్రతిరూపంగా కొలుస్తారు.

మధుర నుంచి గోకులం 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. 


🌿వీటితో పాటు కుసుమ సరోవరం, రాధా కుండ్‌, మధుర మ్యూజియం సందర్శనీయ స్థలాలు.


జై శ్రీకృష్ణ🙏

Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat