☘️శివున్ని పూజించే భక్తులంతా సోమవారం రోజున ప్రత్యేక పూజలు నిర్వహించడం సహజం.ఆ రోజునే ఉపవాసం ఉంటారు చాలామంది ఎందుకని..?
☘️అంటే…. సోముడు అంటే చంద్రుడు. మనకు ఉన్న వారాల పేర్లన్నీ గ్రహాలను అనుసరించి వచ్చాయి. చంద్రుని వారం సోమవారం.
☘️చంద్రుని ధరించినవాడు శివుడు. చంద్రుడే సోముడు కనుక శివుని చంద్రశేఖరుడు అనీ, సోమశేఖరుడు అని పిలుస్తారు.
☘️చంద్రునికి ప్రత్యేకించి ఆలయం లేనందున శివుని ఆరాధించడం ఆనవాయితీగా వస్తోంది. అంతేకాదు.
☘️సోమ అనే శబ్దాన్ని స+ఉమ అని విడగొడితే ఉమాసహితుడు అనే అర్థం వస్తుంది.
ఉమాసహితుడైనవాడు అంటే పార్వతీపతి ఎవరు? శివుడే కదా..! ఆ విధంగా సోమవారం శివునికి ప్రత్యేక దినంగా రూపాంతరం చెందింది.
☘️స్కాందపురాణంలో సోమవార వ్రతమహిమ ఉంది. ఈ రోజున శివుడు ఉమాసహితుడై భక్తులను అనుగ్రహిస్తాడు.
సోముడంటే కుబేరుడు అనే అర్థం కూడా ఉంది. ఐశ్వర్యం ఈశ్వరాదిచ్ఛేత్..ఈశ్వరుడు ఐశ్వర్యదాయకుడు. శివుని ఆరాధించిన కుబేరుడు ఐశ్వర్యవంతుడైన రోజు కనుక ఈ రోజును సోమవారం అని పిలుస్తున్నారని పెద్దలు చెప్పారు.
☘️స్కాందపురాణం సోమవారవ్రతం వైశిష్ట్యాన్ని చెబుతూ అందుకు ఉదాహరణగా చంద్రాంగదుని కథ చెప్పింది. నలదమయంతుల మనుమడు చంద్రాంగదుడు , అతడు చిత్రకర్మ కుమారై సీమంతినిని వివాహమాడి కొంతకాలం మావగారింట్లోసుఖంగా గడిపాడు.
☘️ఓరోజు యమునా నదిలో మిత్రులతో నౌకావిహారం చేస్తూ పెద్దగాలికి నౌక తిరగబడగా నీటిపాలయ్యాడు.
☘️అప్పుడు మైత్రేయి అనే మునిపత్ని సీమంతినికి దైర్యంచెప్పి పరమశివునికి ఇష్టమైన సోమవార వ్రతం చేయమని ప్రోత్సహించింది. అమె వ్రతం ఆరంభించింది.
☘️నౌకా ప్రమాదంలో నీళ్ళలో పడిన చంద్రాంగదుడు అట్టడుగున ఉండే నాగలోకం చేరాడు.
☘️అక్కడ నాగరాజైన తక్షకుడు చంద్రాంగదుని వినయ విధేయతలకు మెచ్చి, కానుకల్చి, నాగకన్యలతో పాటు ఒక నాగ యువకుని తోడిచ్చి సాగనంపాడు అప్పటికి భూలోకంలో మూడేళ్ళు గడిచిపోయాయి. అతని రాజ్యాన్ని శత్రువులు ఆక్రమించారు.
☘️భార్య వ్రతదీక్షలో ఉంది. పరిస్థితిని గమనించిన చంద్రాంగదుడు శత్రువులను జయించి రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలించాడు.
☘️పరమశివునికి ప్రీతికరమైన సోమవార వ్రతాన్నికార్తీక సోమవారాలలో చేస్తే సత్ఫలితాన్నిస్తుంది.
అందరం భక్తితో " అరుణాచల శివ " అని వ్రాసి స్వామి వారి అనుగ్రహం పొందుదాం ... ఎన్ని సార్లు స్మరిస్తే అంత మేలు చేస్తాడు ఆ భగవంతుడు
🌼🌹🌼🌹🌼🌹🌼🌹🌼🌹🌼