*బీజ మంత్రాలతో సంపూర్ణ శరీరంలో వ్యాసం ఎలా చేయాలి* 🌹
*నవవ్యూహార్చన విధి పూజ:*
🌺బీజ మంత్రాలతో సంపూర్ణ శరీరంలో వ్యాసం చేయాలి. బొటనవ్రేలి నుండి చిటికెన వేలి దాకా అయిదు బీజమంత్రాలతో వ్యాసం చేయాలి. ఏ అంగానికి సంబంధించిన బీజ మంత్రాన్ని ఆ జంగన్యాసం చేస్తున్నపుడు మననం చేయాలి.
🌺తరువాత సాధకుడు అనే బీజ మంత్రాలతో దిక్కులను ప్రతిబద్ధం చేసుకొని పూజన క్రియ నారంభించాలి. ముందుగా ఏకాగ్రచిత్తంలో తన హృదయంలో యోగ పీఠాన్ని ధ్యానించాలి. వివిధ దిశలలో ధర్మ, జ్ఞాన, వైరాగ్య, ఐశ్వర్యాలను కల్పించుకొని పూజించి పూర్వాది దిశలలో అధర్మాదులను న్యాసం చేయాలి ఇలా :
*అగ్ని కోణంలో - ఓం ధర్మాయ నమః
*నైరృత్య కోణంలో - ఓం జ్ఞానాయ నమః
*వాయు కోణంలో - ఓం వైరాగ్యాయ నమః
*ఈశాన కోణంలో - ఓం ఐశ్వర్యాయ నమః
*తూర్పు దిక్కులో - ఓం అధర్మాయ నమః
*దక్షిణ దిక్కులో - ఓం అజ్ఞానాయ నమః
*పడమటి దిక్కులో - ఓం అవైరాగ్యాయ నమః
*ఉత్తర దిక్కులో - ఓం అనైశ్వర్యాయ నమః
అని అంటూ న్యాసం చేయాలి.
🌺సాధకుడీ ఈ విధంగా న్యాసవిధులతో తన శరీరాన్ని ఆరాధన పీఠంగానూ తనను తాను దాని స్వరూపంగానూ భావించుకొని తూర్పు వైపు తిరిగి తలను బాగా ఎత్తి స్థిరుడై అనంత భగవానుడైన విష్ణువును తనలో ప్రతిష్ఠితుని చేసుకోవాలి. తరువాత జ్ఞానరూప సరోవరంలో వికసించిన అష్టదళ కమలాన్ని ధ్యానించాలి.